DAILY CURRENT AFFAIRS IN TELUGU 2nd JANUARY 2024
1) కోటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ, సీఈవో గా ఎవరు భాద్యతలు స్వీకరించారు.?
జ : అశోక్ వాస్వాని
2) డిసెంబర్ – 2023 లో దేశంలో వసూలు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 1.64 లక్షల కోట్లు
3) డిసెంబర్ – 2023 లో తెలంగాణ రాష్ట్రం లో వసూలు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 4,753 కోట్లు
4) డిసెంబర్ – 2023 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 3,5454 కోట్లు
5) భారత వాతావరణ విభాగం (IMD) నివేదిక ప్రకారం 1901 నుంచి మొదటి, రెండో వెచ్చని సంవత్సరాలుగా ఏవి నమోదు అయ్యాయి.?
జ : 2016, 2023
6) సిరియమ్ సంస్థ నివేదిక ప్రకారం సమయపాలన లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవి.?
జ : మిన్నే పోలీస్ – సెయింట్ పాల్ (అమెరికా), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్), కెంపెగౌడ విమానాశ్రయం (బెంగళూరు)
7) BRICS కూటమిలో చేరిన నూతన ఐదు దేశాలు ఏవి.?
జ : ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈ
8) ఇజ్రాయిల్ కు అమెరికా సహకారం అందిస్తున్నందుకు తనకు 2002 లో వచ్చిన రామన్ మెగాసేసే అవార్డును ఎవరు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు.?
జ : సందీప్ పాండే
9) దేశవ్యాప్తంగా నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ గొ తెలంగాణలోని ఏ పోలీస్ స్టేషన్ నిలిచింది.?
జ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్
10) చెమటతో షుగర్ పరీక్ష నిర్వహించే పరికరాన్ని కనుగొన్నందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎవరికి పేటెంట్ లభించింది.?
జ : పూసా చిరంజీవి శ్రీనివాసరావు
11) సింగరేణి నూతన సీఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎన్.బలరాం
12) అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకొని ఏటా సగటున ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 30 లక్షల మంది
13) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ మాసంలో నిర్వహించిన మన్ కీ బాత్ లో ప్రస్తావించిన బెజ్జిపురం యూత్ క్లబ్ ఏ జిల్లాకు చెందినది.?
జ : శ్రీకాకుళం
14) భారత్ పాకిస్తాన్ దేశాలు తమ అణ్వస్త్ర కేంద్రాల వివరాలను ఇటీవల ఇచ్చిపుచ్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది.?
జ : 1988
15) తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్
16) అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుండి వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఎవరు.?
జ : డేవిడ్ వార్నర్
17) బంగ్లాదేశ్ కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీతకు ఇటీవల ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : డా. మహమ్మద్ యూనస్
18) కేంద్రం ఇటీవల ఎవరిని ఉగ్రవాదిగా ప్రకటించింది.?
జ : గోల్డీ బ్రార్