DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2024
1) గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారం 2024 గెలుచుకున్న భారతీయుడు ఎవరు.?
జ : అలోక్ శుక్లా
2) తాము తయారుచేసిన ఏ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతున్నాయని ఆస్ట్రాజెనికా ఒప్పుకుంది.?
జ : కోవిషీల్డ్
3) బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ 2024 విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : వెలవన్ సెంథిల్ కుమార్
4) పేటెంటింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2023 – 24 ప్రకారం భారత్ లో ఎన్ని నూతన పేటెంట్లు పొందారు.?
జ : 83 వేలు
5) పేటెంటింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2023 – 24 ప్రకారం భారత్ లో అత్యధిక పేటెంట్లు పొందిన రాష్ట్రం ఏది.?
జ : తమిళనాడు
6) విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిని ఏ సంవత్సరం నాటికి 100 శాతానికి చేర్చాలని నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యంగా పెట్టుకుంది.?
జ :2030
7) ప్రపంచ ఆర్చరీ మహిళల ర్యాంకింగ్ లలో రెండో స్థానంలో నిలిచిన భారతీయ ఆర్చర్ ఎవరు.?
జ : వెన్నం జ్యోతి సురేఖ
8) ఇండియన్ సూపర్ లీగ్ 2024 ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ చేరిన జట్లు ఏవి.?
జ : మోహన్‌బగాన్ & ముంబై
9) ఆంధ్రప్రదేశ్ కం చెందిన ఏ గ్రామ సర్పంచ్ కు ఐక్యరాజ్యసమితి వేదికపై మాట్లాడే అరుదైన గౌరవం దక్కింది.?
జ : పేకేరు గ్రామ సర్పంచ్ హేమకుమారి
10) ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తించడానికి తీసుకుంది.?
జ : కర్ణాటక
11) బ్రిటన్ లో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను ఏ దేశానికి తరలించే బిల్లుకు ఆ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.?
జ : రువాండా
12) ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2022 తో పోలిస్తే 2023లో ఎన్ని కోట్ల మంది ఎక్కువగా ఆకలితో అలమటించారు.?
జ : 2.4 కోట్ల మంది
13)భారతీయుల యూరోపియన్ యూనియన్ పరిధిలో ఐదేళ్లపాటు పర్యటించే అవకాశం కల్పించే ఏ వీసా ను విడుదల చేశారు.?
జ : షెంజెన్ వీసా
14) డస్ట్ లిక్ 2024 పేరుతో భారత్ ఏ దేశంతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించింది.?
జ : ఉజ్బెకిస్తాన్
15) లోక్ సభ సాధారణ ఎన్నికలు 2024లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి ఎవరు.?
జ : ముఖేశ్ దలాల్ (సూరత్)
16) 1951 నుండి నేటి వరకు ఎంత మంది ఎంపీలు లోక్‌సభ కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.?
జ : 35 మంది