DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th SEPTEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 25th SEPTEMBER 2023

1) ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో డ్రోన్ షోను ఏ పేరుతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.?
జ : భారత్ డ్రోన్ శక్తి 2023

2) ఆసియన్ గేమ్స్ 2023 షూటింగ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత జట్టు ఏది.?
జ : రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాంశ్ పన్వార్

3) ఆసియన్ గేమ్స్ 2023లో భారత మహిళల క్రికెట్ జట్టు ఏ జట్టును పైనల్ లో ఓడించి స్వర్ణం నెగ్గింది.?
జ : శ్రీలంక

4) ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 25

5) ఫ్రాన్స్ దేశం ఏ దేశం నుండి తన దౌత్య అధికారిని మరియు సేనలను వెనక్కి పిలిపించింది.?
జ : నైగర్

6) కేంద్ర పర్యాటక శాఖ అస్సాంలోని ఏ గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది.?
జ : బిస్వంత్ ఘాట్

7) ఇటీవల ఇజ్రాయిల్ దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఏ మిస్సైల్ ట్యాంకును ఆవిష్కరించింది.?
జ : మెర్కావా మార్క్ – 5 (బారక్)

8) ఈశాన్య రాష్ట్రాలలో ఉండే ఏ గేదేను ఫుడ్ అనిమల్ గా గుర్తిస్తూ FSSA నిర్ణయం తీసుకుంది.?
జ : మిథున్

9) I2U2 దేశాలు ఉమ్మడి అంతరిక్ష కార్యక్రమం కోసం ఒప్పందం చేసుకున్నాయి. I2U2 దేశాలు ఏవి.?
జ : ఇండియా, ఇజ్రాయిల్, UAE, US

10) 20వ జాతీయ పుస్తక ప్రదర్శన – 2023 ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరుగుతుంది. ఈ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏమిటి.?
జ : జ్ఞాన్ కుంభ్

11) అంతర్జాతీయ సంజ్ఞ భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 23

12) తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రగతి నివేదిక 2023 ప్రకారం ప్రస్తుతం శిశు మరణాల రేటు, మాతా మరణాల రేటు ఎంతగా నమోదు అవుతుంది.?
జ : 21 & 43

13) కరోనాను మించి ఏ నూతన వైరస్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మందిని బలి తీసుకోని ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.?
జ : వైరస్ – X

14) అశ్విని భట్నగర్ & ఆర్ సి గంగ్జూ రచించిన ఫరుఖ్ అబ్దుల్లా జీవిత కథ పేరు ఏమిటి.?
జ : ఫరూక్ ఆఫ్ కాశ్మీర్

15) 72 అడుగుల పండిత్ దేని దయాల్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏ నగరంలో ఆవిష్కరించారు.?
జ : న్యూ ఢిల్లీ

16) విద్యుత్ వాహనాల అమ్మకాలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తమిళనాడు

17) 2023 – 24 ఆర్థిక సంవత్సరం లో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంతగా నమోదు అవుతుందని ఎస్ అండ్ పి గ్రూప్ తాజా అంచనాలలో వెల్లడించింది.?
జ : 6 శాతం

18) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జయంతులను తాజాగా రాష్ట్ర పండుగలుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : చాకలి ఐలమ్మ (సెప్టెంబర్ – 26), కొండ లక్ష్మణ్ బాపూజీ (సెప్టెంబర్ – 27)

19) దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే బస్సును ఏ సంస్థ ప్రారంభించింది.?
జ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

20) నికోటిన్ శాతం 40 నుండి 50% తక్కువగా ఉన్న పొగాకును అభివృద్ధి చేసిన సంస్థ పేరు ఏమిటి.?
జ : సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమాటికల్ ప్లాంట్స్

21) నీతి ఆయోగ్ విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్ 2021లో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడోవ స్థానం