డైలీ కరెంట్ అఫైర్స్ Q & A ఎప్రిల్ 27, 2022

Q1. 5 నుండి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చే కార్బేవ్యాక్స్ వ్యాక్సిన్ ని ఏ కంపెనీ తయారు చేస్తుంది.?
జ : బయలాజికల్ ఈ

Q2. 2030నాటికి సంవత్సరానికి ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించనున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.?
జ :- 560

Q3. ప్రపంచంలో అత్యధిక అణు వార్ హెడ్ లు కలిగి ఉన్న దేశం ఏది.?
జ : రష్యా

Q4. ఈ ఏడాది నిర్వహించే 19వ ఆసియా క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి.?
జ : చైనాలోని హాంగ్జౌ నగరం

Q5. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) చైర్‌పర్సన్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ :- కృష్ణన్‌ రామానుజం

Q6. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పథకం కింద.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పదికి పది ఆదర్శ గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవి.?
జ : తెలంగాణ

Q7. ఉక్రెయిన్‌కు జెపార్డ్‌ గన్స్‌ పంపుతామని ప్రకటించిన దేశం?
జ : జర్మనీ

Q8. రెజినా డైలాగ్‌ – 2022 కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన నగరం?
జ : డిల్లీ

Q9. ప్రపంచంలోనే అత్యధిక వయసుగల (119 ఏళ్ళు) వ్యక్తిగా గిన్నిస్ రికార్డు కలిగిన కానే ఠనాకా తాజాగా మరణించారు. ఆమె ఏ దేశానికి చెందినది.?
జ : జపాన్

Q10. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఐపీఎల్ లో వార్షిక ఆర్థిక వృద్ధి రేటు ఎంత.?
జ : 24%

Q11. ఐపీఎల్ లో అత్యధిక విలువైన జట్టు ఏది.?
జ : ముంబై ఇండియన్స్ (9966 కోట్లు)

Q12. అత్యధిక సైనిక వ్యయం నిర్వహించే దేశాలలో భారత్ స్థానం ఎంత.?
జ : 3వ స్థానం

Q13. 2026 నాటికి దేశ జనాభాలో వృద్ధులు ఎంత శాతం గా ఉండనున్నారు.?
జ : 13.1% (17.32 కోట్లు)

Q14. మిషన్ ఎనర్జీ పౌండేషన్ అందించి ఎనర్జీ ఎఫిషియన్సీ పురస్కారం తెలంగాణలోని ఏ సంస్థగెలుచుకుంది.?
జ : సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం

Q15. రసాయన ప్రాజెక్టు కోసం యూఏఈ దేశంతో ఒప్పందం చేసుకున్న భారత సంస్థ ఏది.?
జ : రిలయన్స్

Q16. ఉత్తర కొరియా సైన్యం ఎన్నో వార్షికోత్సవాన్ని తాజాగా నిర్వహించుకుంది.?
జ : 90వ

Follow Us @