DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd NOVEMBER 2023
1) ప్రెసిడెంట్ కలర్ అవార్డు అందుకున్న మెడికల్ కాలేజ్ ఏది?
జ : ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే
2) ప్రపంచ టెలివిజన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 21
3) లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేతగా నిలిచినది ఎవరు.?
జ : వెర్‌స్టాఫెన్
4) మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావల్ యాంటీ షిఫ్ మిస్సైల్ ను డిఆర్డిఓ ఎక్కడ పరీక్షించింది.?
జ : విశాఖపట్నం
5) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు.?
జ : వినయ్ టోన్సే
6) పంజాబీ భాషలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన “దాహన్ ప్రైజ్ 2023” ను మొట్టమొదటిసారిగా ఒక మహిళ రచయిత గెలుచుకుంది. ఆమె ఎవరు.?
జ : దీప్తి బబూటా
7) “దాహన్ ప్రైజ్ 2023” ను దీప్తి బబూటా రచించిన ఏ రచనుకు ఇచ్చారు.?
జ : HUNGER BREATHES LIKE THIS
8) ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏ దేశంలో ఇటీవల ప్రారంభించారు.?
జ : యూఏఈ
9) లా లీస్టే అనే సంస్థ 2024 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 1,000 రెస్టారెంట్లలో భారత్ నుండి ఎన్ని రెస్టారెంట్లు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 10
10) లా లీస్టే అనే సంస్థ 2024 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 1,000 రెస్టారెంట్లలో తెలంగాణ నుండి చోటు సంపాదించుకున్న రెస్టారెంట్ ఏది.?
జ : ఆదా రెస్టారెంట్ (హైదరాబాద్)
11) ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డ్స్ 2023లో బెస్ట్ కమెడియన్ అవార్డు గెలుచుకున్న భారత నటుడు ఎవరు.?
జ : వీర్ దాస్
12) “వజ్ర ప్రహార్” అనే పేరుతో ప్రత్యేక దళాల సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు. వీటిని మేఘాలయలో నవంబర్ 21 నుండి డిసెంబర్ 11 వరకు నిర్వహించనున్నారు.?
జ : భారత్ – అమెరికా
13) ప్రపంచ మత్స్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 21
14) అరుణాచల్ ప్రదేశ్ లోని బ్రహ్మపుత్ర నది తీరంలో ఏ కొత్త జాతి కప్పలను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.?
జ : మ్యూజిక్ ప్రాగ్
15) అమెరికా దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం (మెక్సికో, ఎల్ సాల్వడార్ మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి)
16) ఆసియా పారా అర్చరీ చాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి స్థానం (నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యం)
17) అంతు చిక్కని నిమోనియా వ్యాధితో ఏ దేశంలోని చిన్నారులు తీవ్రంగా బాధపడుతున్నట్లు ప్రోమెడ్ అనే సంస్థ హెచ్చరించింది.?
జ : చైనా
18) ఓపెన్ ఏఐ సంస్థకు తిరిగి సీఈఓ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : ఆల్ట్‌మన్
19) తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని కోరుతూ ఏ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది.?
జ : బీహార్
20) బ్రిక్స్ కూటమిలో చేరడానికి తాజాగా ఏ దేశం దరఖాస్తు చేసుకుంది.?
జ : పాకిస్తాన్