DAILY CURRENT AFFAIRS IN TELUGU 22nd JUNE 2023
1) అమెరికాలో మొట్టమొదటి ముస్లిం మహిళా ఫెడరల్ జడ్జిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నస్రత్ చౌదరీ
2) Ex Khaan Quest 2023 పేరుతో ఏ దేశం శాంతి పరిరక్షణ కోసం నిర్వహించింది.?
జ : మంగోలియా
3) ‘INS కిర్పాన్’ యుద్ధ వాహక నౌకను భారతదేశం ఏ దేశానికి బహుమతిగా ఇవ్వనుంది.?
జ : వియత్నాం
4) ‘నేషనల్ యోగ ఒలంపియాడ్’ ఏ రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది.?
జ : మధ్యప్రదేశ్
5) ఏ బ్యాంకు భారత ఆర్థిక శాఖకు 5740 కోట్ల డివిడెంట్ ను చెల్లించింది.?
జ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6) లడక్ ప్రాంతంలో భారతీయ నేవీ మీద అవగాహన కల్పించుటకు ఇండియన్ నేవీ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : జూలీ లడక్
7) ‘మై అకౌంట్ మై నేమ్’ అనే పథకాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది.?
జ : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
8) ఇండియా యూరోపియన్ యూనియన్ గ్లోబల్ గేట్ వే సదస్సు ఏ నగరంలో జరిగింది.?
జ : షిల్లాంగ్
9) మణిపూర్ అల్లర్ల మీద వేసిన కమిటీకి చైర్మన్ ఎవరు?
జ : అజయ్ లాంబ
10) ఫిచ్ సంస్థ తాజా నివేదిక ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.3% (గతంలో 6% ప్రకటించింది)
11) ఫిచ్ సంస్థ భారత్ కు ఏ సార్వభౌమ రేటింగ్ ఇచ్చింది.?
జ : BBB
12) నౌకాదళ జలాంతర్గాములకు చోదక వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రాజెక్టును డిఆర్డిఓ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : ఎల్ అండ్ టి
13) ఐక్యరాజ్యసమితి సంస్థ అయినా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ‘ది గ్లోబల్ ఫుడ్ పాలసీ’ నివేదిక ప్రకారం భారత్ లో ఎంత శాతం మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారు.?
జ : 16%
14) టైమ్స్ హై ఎడ్యుకేషన్ సంస్థ విడుదల చేసిన ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ లలో భారత్ తరఫున మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది?
జ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు
15) అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ఏ క్రీడ సంఘం యొక్క గుర్తింపును రద్దు చేసింది.?
జ : అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (IBA)
16) భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ కవర్లను తయారుచేసిన ఎవరికి గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు 2023 దక్కింది.?
జ : కే. వీరబ్రహ్మం
17) ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ఏఎన్ఎం విభాగంలో సొంతం చేసుకున్న తెలంగాణకు చెందిన నర్స్ ఎవరు.?
జ : తేజావత్ సుశీల
18) యుద్ధ విమానాలలో ఉపయోగించే ఏ జెట్ ఇంజన్లను భారత్ లో తయారు చేయడానికి అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది.?
జ : F414
19) తెలంగాణ మహారాష్ట్ర సంయుక్తంగా నిర్మించిన చనాక – కోరాట ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇది ఏ నదిపై నిర్మించారు.?
జ : పెన్ గంగా (ఆదిలాబాద్)
20) అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీకి ఏ కవి యొక్క కవితా సంకలనాన్ని బహుమతి గా ఇచ్చాడు.?
జ : కలెక్టడ్ పోయోమ్స్ ఆప్ రాబర్ట్ ప్రాస్ట్
- DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 3rd SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 2nd SEPTEMBER
- DAY WISE CURRENT AFFAIRS 2024
- CURRENT AFFAIRS SEPTEMBER 2024