1) అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు.?
జ : జూన్ – 21
2) ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ ఏమిటి.?
జ : మానవత్వం కోసం యోగా (YOGA FOR HUMANITY)
3) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు.?
జ : 2015 నుండి
4) ఐక్యరాజ్య సమితి లో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : రుచిరా కాంబోజ్
5) భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఎవరిని ఎంపిక చేసింది. ?
జ : ద్రౌపది ముర్ము
6) ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం ఎవరు తన నోబెల్ బహుమతిని వేలం వేశారు.
జ : రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ (2021 నోబెల్ విజేత)
7) తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద మంచి నీటి చేపను గుర్తించారు. దాని పేరు ఏమిటి.?
జ : క్రిస్టెన్డ్ బోరామీ
8) ఫిన్‌లాండ్‌లో జరిగిన కూర్తానె గేమ్స్‌లో జావెలిన్ త్రో లో స్వర్ణం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా
9) 24 గంటలలో 125 కీ.మీ. పరెగిత్తి ప్రపంచ రికార్డు సృష్టించిన 82 ఏళ్ల మహిళా పేరు ఏమిటి.?
జ : బార్బరా హంబర్ట్ (ఫ్రాన్స్)
10) బుద్ధుని అవశేషాలను ఏ దేశంలో ప్రదర్శనకు ఉంచారు.?
జ : మంగోలియా
11) గంజాయి సాగును చట్టబద్ధం చేసిన తొలి దేశం ఏది.?
జ : థాయిలాండ్
12) భారతదేశంకు చమురు సరఫరాలో రెండో స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : రష్యా
13) ప్రపంచ పోటీతత్వ సూచిలో 63 దేశాలలో భారత్ స్థానం ఎంత.?
జ : 37
14) ప్రపంచ పోటీతత్వ సూచిలో 63 దేశాలలో మొదటి స్థానంలో స్థానం ఎంత.?
జ : డెన్మార్క్
15) ఏక కాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి గిన్నిస్ రికార్డు సృష్టించిన దేశం ఏది.?
జ : భారతదేశం