DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 20th NOVEMBER 2023

1) జైపూర్ మైనపు మ్యూజియంలో ఇటీవల ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.? జ : విరాట్ కోహ్లీ (50 సెంచరీలు చేసిన సందర్భంగా)

2) జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల తీర్థ యాత్రల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఏ రైలును దేశవ్యాప్తంగా వైష్ణో దేవి ఆలయం రైల్వే స్టేషన్లో ప్రారంభించారు.?
జ : జ్ఞానోదయ ఎక్స్‌ప్రెస్ – కాలేజ్ ఆన్ వీల్స్

3) IFFI 2023 జ్యూరీ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రాజ్‌కుమార్ హీరాని

4) అర్జెంటినా తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు.?
జ : జేవియర్ మేలి

5) ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ లో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవార్డు పొందింది.?
జ : ఉత్తర ప్రదేశ్

6) నవంబర్ 23 నుండి 25 వరకు మధుర నగరంలో నిర్వహించే బ్రజ్ రాజ్ ఉత్సవాలు ఎవరి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తారు.?
జ : మీరాబాయి

7) ‘ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా’ అనే అవార్డును కొలంబియా ప్రభుత్వం ఎవరికి అందజేసింది.?
జ : ర్యాన్ రెనాల్డ్స్

8) కొండి నాస్ట్ మ్యాగజైన్ ప్రకారం 2024 లో భారత్ లో కచ్చితంగా సందర్శించవలసిన ప్రాంతం ఏది.?
జ : కోచి (కేరళ)

9) ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్ టోర్నీ 2023 విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : పంకజ్ అద్వానీ

10) ఏటీపీ టెన్నిస్ టోర్నీ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : నోవాక్ జకోవిచ్ (ఏడవ సారి)

11) ICC వరల్డ్ కప్ టీమ్ ఆప్ ద టోర్నమెంట్ కు కెప్టెన్ గా ఎవరిని ప్రకటించింది.?
జ : రోహిత్ శర్మ

12) లైబీరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జోషెఫ్ బోయకై

13) ISB రీసెర్చ్ కెటలిస్ట్ అవార్డు కు ఎవరిని ఎంపిక చేసింది.?
జ : క్రిస్ గోపాలకృష్ణన్

14) ఏ దేశపు పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు పొగ బాంబులు వేసి, మంటలు పెట్టారు.?
జ : ఆల్బెనియా

15) డిస్నీ హాట్ స్టార్ యాప్ లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను ఎంతమంది వీక్షకులు వీక్షించారు.?
జ : 5.9 కోట్ల మంది