DAILY CURRENT AFFAIRS IN TELUGU 1st JUNE 2023

1) మే – 2023 మాసంలో దేశంలో జీఎస్టీ వసూలు ఎంతగా నమోదయింది.?
జ : 1 57 లక్షల కోట్లు

2) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు ఎంతగా ఉంటుందని సిఐఐ అంచనా వేసింది.?
జ : 6.5 – 6.7%

3) ఐరాస – ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారత భారతీయుడు ఎవరు.?
జ : మత్యుంజయ్ మహాపాత్రో

4) ఐరాస – ప్రపంచ వాతావరణ సంస్థ తిపతిగా నియమితురాలైన తొలి మహిళగా ఎవరు.?
జ : సెలెస్టా సౌలో (అర్జెంటీనా)

5) ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ అధ్యక్షుడిగా ఎవరు.?
జ : డెన్నిస్ ప్రాన్సిస్

6) భారత్ లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధానమంత్రి పేరు ఏమిటి.?
జ : ప్రచండ

7) టైమ్స్ పత్రిక ఉన్నత విద్య ప్రభావ ర్యాంకులు 2023 లో భారత్లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : అమృత విశ్వవిద్యా పీఠం (కోయంబత్తూరు)

8) కేంద్రం ప్రారంభించిన “హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్” ఉద్దేశమేమిటి.?
జ : ఆల్గే, నీళ్ల నుండి హైడ్రోజన్ & ఆక్సిజన్ వేరు చేయడం

9) తెలంగాణలో ఎక్కడ తొలి త్రీడి ప్రింటింగ్ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు.?
జ : సిద్దిపేట

10) జూనియర్ హాకీ ఆసియా కప్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : భారత్

11) మే 2023లో తెలంగాణ రాష్ట్రంలో వసూళ్లైన జిఎస్టి ఎంత.?
జ : 4,507 కోట్లు

12) అమెరికన్ ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ 2023 కు ఎంపికైన ప్రవాస భారతీయ విద్యార్థి ఎవరు.?
జ : తేజ కోడూరు

13) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ సరోవర్ పథకం లక్ష్యం ఏమిటి.?
జ : 50 వేల మంచి నీటి జలాశయాల అభివృద్ధి

14) ప్రపంచ అభివృద్ధి నివేదిక 2023ను విడుదల చేసిన సంస్థ ఏది.?
జ : ప్రపంచ బ్యాంకు