DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th NOVEMBER 2023
1) ఆల్ట్రా ప్రాసెసింగ్ ఫుడ్ (జంక్ ఫుడ్) పై అదనంగా 10 శాతం టాక్స్ విధించిన దేశం ఏది.?
జ : కొలంబియా
2) బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కానుకలుగా ఏమి అందించాడు.?
జ : గణపతి విగ్రహం, కోహ్లీ సంతకం చేసిన బ్యాట్
3) స్పెర్మ్ వేల్స్ రక్షణ కోసం ఏ దేశం ప్రత్యేక రిజర్వ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది.?
జ : డొమినికా
4) ఏ జీవుల వ్యాప్తి కారణంగా దక్షిణ కొరియా ఆరోగ్య శాఖ హైలెట్ ప్రకటించింది.?
జ : నల్లులు
5) 6వ ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు – 2023 భారత్ లోని ఏ నగరంలో జరగనుంది.?
జ : డెహ్రాడూన్
6) పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడానికి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ఎన్ని మిలియన్ డాలర్లను భారత్ కు రుణంగా అందించింది.?
జ : 400 మిలియన్ డాలర్లు
7) శబరిమల అయ్యప్ప భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి.?
జ : అయ్యన్
8) భారత్, శ్రీలంక దేశాల మధ్య 9వ విడత సైనిక విన్యాసాలు పూణే వేదికగా ఏ పేరుతో నిర్వహిస్తున్నారు.
జ : మిత్ర శక్తి
9) ముంబై, నవీ ముంబైని కలుపుతూ నిర్మించిన “ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్’ అనే 22 కిలోమీటర్ల సముద్రపు వంతెనకు ఎవరి పేరు పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : అటల్ బిహారి వాజ్ పేయి
10) తాజాగా ఏ రాష్ట్రం రైతులకు భూ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చింది.?
జ : ఆంధ్ర ప్రదేశ్
11) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఏ ఎత్తిపోతల పథకానికి ఇటీవల శంకుస్థాపన చేశారు.?
జ : వరికపొడిశెల ఎత్తిపోతల పథకం
12) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే చాట్ బాట్లలో అత్యంత ఆదరణ పొందినది ఏది.?
జ : చాట్ జిపిటి
13) ఒబెరాయ్ హోటల్స్ చైర్మన్ ఇటీవల కన్నుమూశారు అతని పేరు ఏమిటి.?
జ : పృధ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్
14) నాసా, ఇస్రో రెండు సంస్థలు కలిసి NISAR ప్రాజెక్టును డిసెంబర్ 2023లో ప్రారంభించనున్నాయి. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏమిటి.?
జ : ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని పరిశీలించడం.
15) NISAR అంటే ఏమిటి.?
జ : NASA ISRO SYNTHETIC APERTURE RADAR
16) మైగ్రేన్ నివారణ కోసం చేతికి ధరించే యంత్రాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏ పేరుతో విడుదల చేసింది.?
జ : నెరివియో
17) రైతులు ప్రొటెక్షన్ బాలిస్టిక్ హెల్మెట్ ను ఏ పేరుతో తయారు చేశారు.?
జ : కార్వోడోమా – 360
18) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నరసింహా శర్మ
19) కళావర్ పురస్కారం ఎవరికి అందజేశారు.?
జ : అపోలినారిస్ డిసౌజా