DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th AUGUST 2023

1) కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం 2022వ సంవత్సరంలో అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్ (2. తమిళనాడు,.3 – ఆంధ్రప్రదేశ్)

2) భారత్ ఏ సంవత్సరం వరకు తన ఇంధన అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధనాల ద్వారా తీర్చుకోవాలని లక్ష్యం పెట్టుకుంది.?
జ : 2030

3) మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ భారత్ కం ఏ సార్వభౌమ రేటింగును ఇచ్చింది.?
జ : BAA3

4) దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం ఎంతగా నమోదు అయినట్లు కేంద్రం వెల్లడించింది.?
జ : 360.79 లక్షల హెక్టార్లు

5) ఆగస్టు 22 – 24 వ తేదీలలో బ్రిక్స్ సదస్సు ఏ నగరంలో జరుగుతుంది.?
జ : జోహాన్నస్‌బర్గ్ (దక్షిణ ఆఫ్రికా)

6) ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2023 మిక్స్డ్ విభాగంలో స్వర్ణం దక్కించుకున్న భారత జోడి ఏది?
జ : ఇషాసింగ్ & శివ నర్వాల్

7) ప్రపంచ అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండో ఎడాది కూడా స్వర్ణం దక్కించుకున్న భారత రెజ్లర్ ఎవరు.?
జ : అంతిమ్ ఫంగల్

8) వర్షాలు, వరదలు, పిడుగులు, భూకంపాల వలన ఆగస్టు 2023 వరకు భారత్ లో ఎన్ని మరణాలు సంభవించినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.?
జ : 2,038 మంది

9) భారతదేశంలో తొలి త్రిడి ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : బెంగళూరు

10) భారత్ లో మొట్టమొదటి “ఇండియా మెట్ టెక్ ఎక్స్‌ఫో 2023” ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ ప్రారంభించారు.?
జ : గుజరాత్

11) ‘ఇండియన్ ఫార్మాకోపియా’ అనే వైద్య పుస్తకాన్ని ఏ దేశం అధికారికంగా వినియోగించుకోవడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికి ఈ పుస్తకాన్ని అధికారికంగా వినియోగించుకున్న దేశాలు ఐదు.?
జ : సురీనామ్

12) భారత్ చేపట్టనున్న సముద్ర యాన్ మిషన్ లక్ష్యం ఏమిటి.?
జ : సముద్రంలో 6000 పైగా మీటర్ల లోతులో ఖనిజ అన్వేషణ.

13) సముద్రయాన్ మిషన్ కు భారత ప్రభుత్వం పెట్టిన పేరు ఏమిటి?
జ : మత్స్య 6000