DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th MAY 2023

1) ఇటీవల మరణించిన హిందూజా గ్రూప్ చైర్మన్ ఎవరు?
జ : ఎస్పీ హిందూజా

2) సుదీర్మన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2023 ఏ దేశంలో జరుగుతుంది.?
జ : చైనా

3) ఇటీవల మీజోరాం రాష్ట్రంలో అత్యల్ప దూరం ఎగిరే బల్లి జాతి జీవిని కనిపెట్టారుమ. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : గెక్కో మిజోరమెన్సిస్

4) ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు (27 సార్లు) ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించిన నేపాల్ కు చెందిన వ్యక్తి ఎవరు.?
జ : షెర్పా కమీ రీటా (26 సార్లు – పసంగ్ దవా)

5) మే 24 వ తేదీన ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఏ అంతర్జాతీయ సదస్సు రద్దయింది.?
జ : క్వాడ్ సదస్సు

6) ఏ ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థ హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.?
జ : వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ

7) నైట్ ప్రాంక్ నివేదిక ప్రకారం భారత్ లో 30 మిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులు సంఖ్య ఎంత శాతం తగ్గింది.?
జ : 7.5%

8) 2023 24 ఖరీఫ్ సీజన్ లో ఎరువులపై రైతులకు ఎన్ని లక్షల కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.?
జ : 1.08 లక్షల కోట్లు

9) 76వ కాన్స్ చిత్రోత్సవాలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి.?
జ : ప్రాన్స్

10) ప్రపంచ గోల్ప్ ర్యాంకింగ్ లో టాప్ 50 లో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఎవరు గుర్తింపు పొందారు.?
జ : అదితి అశోక్

11) కృత్రిమ తీపి కారకాలతో ఎటువంటి డయాబెటిస్ వస్తుందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది టైప్ 2 డయాబెటిస్

12) సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహంగా మళ్ళీ ఏ గ్రహం నిలిచింది.?
జ : శని గ్రహం (145)

13) సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన రెండో గ్రహంగా ఏ గ్రహం నిలిచింది.?
జ : గురుగ్రహం (95)