DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 16th NOVEMBER 2023

1) వన్డే ప్రపంచ కప్ లో భారత తరఫున ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహమ్మద్ షమి ( ఏడు వికెట్లు)

2) స్పెయిన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పెడ్రో సాంఛెజ్

3) వన్డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా ఎన్నోసారి ఫైనల్ కు చేరింది.?
జ : 8వ సారి (ఐదు సార్లు విజేతగా నిలిచింది)

4) రోమ్ లో ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ఫోరం 2023 సదస్సులో ఐ.రా.స. ప్రత్యేక అతిధిగా పాల్గొని ప్రసంగించిన 11 ఏళ్ల భారతీయ బాలిక ఎవరు.?
జ : లిసిప్రియ కంగుజం

5) స్టాండర్డ్ & పూర్ (S&P) సంస్థ తాజా అంచనాల ప్రకారం 2024 – 26 ఆర్థిక సంవత్సరాలలో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6 – 7.1%

6) తలసిమియా, సికెల్ సెల్ ఎనిమియా వ్యాధులకు చికిత్స చేయడానికి ఏ మందును బ్రిటన్ వైద్యులు కనిపెట్టారు.?
జ : కాస్ గెవీ

7) వన్డే ప్రపంచ కప్ లలో రెండు ఎడిషన్లలో 500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరు.?
జ : సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్

8) ప్రభుత్వ రంగ సంస్థ ఇర్ఖాన్ ఇటీవల నవరత్న హోదా పొందింది. నవరత్న హోదా పొందిన ఎన్నో సంస్థ ఇది.?
జ : 15

9) 2028 లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఒలంపిక్ క్రీడల్లో నూతనంగా 5 క్రీడలను ప్రవేశపెడుతూ అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ క్రీడలు ఏవి.?
జ : క్రికెట్, స్కాష్, బేస్బాల్/సాఫ్ట్ బాల్, లాక్రాస్, ఫ్లాగ్ పుట్‌బాల్

10) ఏ దేశ అధ్యక్షుడిపై ప్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.?
జ : సిరియా అధ్యక్షుడు బసర్ అస్సద్ పై

11) ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ ను ఏ దేశం ఆవిష్కరించింది.?
జ : చైనా

12) లాన్సెట్ సంస్థ తాజా నివేదిక ప్రకారం 2100 నాటికి భూమి ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెంటిగ్రేట్ పెరిగే అవకాశం ఉంది.?
జ : 2.7 డిగ్రీల సెంటీ గ్రేడ్

13) పాము ఆకారంలో ఉండే రోబో ను అంతరిక్షంలో, గ్రహాల మీద సంచరించడానికి నాసా రూపొందించనున్న రోబో పేరు ఏమిటి.?
జ : ఎక్సో బయాలజీ ఎక్స్ టెంట్ లైఫ్ సర్వేయర్

14) వరల్డ్ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు టాప్ 5 లిస్టులో చోటు పొందిన భారతీయ క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా

15) ఐదు సంవత్సరాల లో ఎన్ని వేల కొత్త రైళ్ళను ప్రవేశపెట్టినట్లు రైల్వే శాఖ ప్రకటించింది .?
జ : 3,000

16) వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదైన ఎడిషన్ గా ఏది నిలిచింది.?
జ : 2023 ప్రపంచ కప్

17) సంపూర్ణ్ పేరుతో ఏ సంస్థలు కలిసి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి తెలపడానికి సూచిని అభివృద్ధి చేశాయి.?
జ : SIDBI & JOCTA