మార్చి 19, 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2022 సెమీ ఫైనల్ లో చేరిన తొలి భారతీయ జోడి ఎవరు.?
జ :- గాయత్రీ గోపిచంద్, త్రిషా జాలీ

Q2. 2023 మార్చి నాటికి యూఎస్ డాలర్ తో భారతీయ రూపాయి విలువ ఎంత పతనం చెందుతుందని క్రిసిల్ తెలిపింది.?
జ : 77.5 రూపాయలు

Q3. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఏ విదేశీ సుప్రీంకోర్టును తాజాగా సందర్శించారు.?
జ :- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)

Q4. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం ఫ్లైట్ కంట్రోల్ సిస్టం భవనాన్ని ఏ నగరంలో నిర్మించారు.?
జ :- బెంగళూరు (డి ఆర్ డి వో)

Q5. రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడం వలన ఎంత మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.?
జ :- కోటి మంది

Q6. జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేస్తున్న దేశం ఏది.?
జ:- చైనా

Q7. కాశ్మీరీ ఫైల్స్ సినిమా దర్శకుడు ఎవరు.?
జ:- వివేక్ అగ్నిహోత్రి

Q8. ప్రపంచ సుందరి 2021 పోటీలలో తొలి రన్నరప్ గా నిలిచిన యువతి పేరు ఏమిటి.?
జ :- శ్రీ షైనీ (ప్రవాస భారతీయురాలు)

Q9. ప్రపంచ ఆనందకర దేశాల జాబితాలో తొలి, చివరి స్థానంలో నిలిచిన దేశాలు ఏవి.?
జ :- ఫీన్లాండ్, ఆఫ్ఘనిస్తాన్

Q10. ప్రపంచ ఆనందకరమైన దేశాల జాబితాలో భారత్ స్థానం ఏమిటి ?
జ:- 136

Q11. కాలుష్య కోరల్లో చిక్కుకున్న గోదావరి నదికి కేంద్ర జల సంఘం ఏ గ్రేడ్ ను కేటాయించింది.?
జ :- ‘డి’ గ్రేడ్

Q12. డిఆర్డిఓ బెంగుళూరు లో ఫ్లైట్ కంట్రోల్ సిస్టం కొరకు ఏడంతస్తుల భవనాన్ని ఎన్ని రోజుల్లో నిర్మించింది.?
జ:- 45 రోజులు

Q13. తాజాగా మరణించిన.. తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ ఎవరు.?
జ:- మల్లు స్వరాజ్యం

Q14. పరీక్ష రాసేందుకు పేపర్ కొనలేక పరీక్షలను రద్దు చేసిన దేశం ఏది.
జ :- శ్రీలంక

Q15. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2022 ఫైనల్ చేరిన భారతీయుడు ఎవరు ?
జ :- లక్ష్యసేన్

Follow Us @