DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th NOVEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th NOVEMBER 2023

1) 33వ వరల్డ్ యానిమల్ హెల్త్ సదస్సు 2023 కు ఆతిధ్యం ఇస్తున్న నగరం ఏది.?
జ : న్యూడిల్లీ

2) 18వ దుబాయ్ ఏయిర్ షో 2023 లో భారత్ వాయుసేన ఏ యుద్ధ విమానాలను ప్రదర్శించింది.?
జ : తేజస్ & దృవ్

3) అయోధ్య దీపోత్సవం లో ఎన్ని లక్షల దీపాలను ఒకేసారి వెలిగించారు.?
జ : 22 లక్షలు

4) యూనిఫామ్ సివిల్ కోడ్ ను ఆమోదించడానికి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది?
జ : ఉత్తరాఖండ్

5) లింగం ఆధారంగా జరిగే దాడులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : నహీ చేత్నా 2.0

6) ఆరవ ఇండియా – ఒపెక్ కూటమి మద్య శక్తి వినియోగం పై చర్చలు ఎక్కడ నిర్వహించారు.?
జ : వియాత్నం – ఆస్ట్రియా

7) జాతీయ బాలల దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా నవంబర్ 14న నిర్వహిస్తారు.?
జ : జవహర్ లాల్ నేహ్రు

8) స్విట్జర్లాండ్ కు చెందిన ఐ క్యు ఎయిర్ సంస్థ నివేదిక ప్రకారం దీపావళి మరుసటి రోజు ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం కలిగిన నగరం ఏది.?
జ : న్యూఢిల్లీ

9) ఆసియన్ కూటమి రక్షణ శాఖ మంత్రుల సదస్సు 2023 కు ఏ నగరం ఆతిద్యం ఇస్తుంది.?
జ : జకర్తా – ఇండోనేషియా

10) జన జాతీయ గౌరవ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 15

11) జన జాతీయ గౌరవ దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు.?
జ : బిర్సా ముండా

12) జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 15

13) ఏ అరుదైన, ఖరీదైన కలప జాతిని సాగు చేసుకోవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.?
జ : ఎర్రచందనం

14) 5 నుండి 6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న విమానాలను కూల్చడానికి ఉపయోగించే ఏ ఆయుధాలను రష్యా నుండి కొనుగోలు చేయడానికి భారత్ నిర్ణయం తీసుకుంది.?
జ : ఇగ్లా ఎస్

15) 21,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేస్తూ 17,444 మీటర్ల ఎత్తులో ఉన్న కాళాపత్తర్ పర్వతం మీదకు దిగిన భారత మహిళా స్కైడైవర్ ఎవరు.?
జ : శీతల్ మహాజన్

16) ఇటీవల కన్నుమూసిన సహారా గ్రూప్ వ్యవస్థాపకులు ఎవరు.?
జ : సుభ్రతో రాయ్

17) అక్టోబర్ 2023 మాసానికి సంబంధించి టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : మైనస్ 0.52%