DAILY CURRENT AFFAIRS IN TELUGU 12th NOVEMBER 2023
1) వన్డే ప్రపంచ కప్ లో భారత తరఫున సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కేఎల్ రాహుల్ (మొదటి వ్యక్తి రాహుల్ ద్రావిడ్)
2) వన్డే ప్రపంచ కప్ లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన మాత్రధారుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కేఎల్ రాహుల్ (62 బంతుల్లో)
3) 97 ఏళ్ల వయసులో కూడా న్యాయస్థానంలో కేసులు వాదిస్తూ గిన్నిస్ రికార్డులకు ఎక్కిన కేరళ వాసి ఎవరు.?
జ : సుబ్రహ్మణ్యన్ మీనన్
4) యూపీఐ పేమెంట్ సేఫ్టీ అథారిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పంకజ్ త్రిపాఠి
5) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తక్కెడశిల జానీ రచించిన ఏ విమర్శనాత్మక గ్రంధానికి యువ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.?
జ : వివేకిని
6) ఇస్రో చైర్మన్ సోమనాథ్ తన ఆటోగ్రాఫి పబ్లిషింగ్ ను నిలిపివేశారు. దాని పేరు ఏమిటి.?
జ : నిలవు కుడిచ సింహంగళ్
7) ప్రపంచంలోనే తొలిసారి పూర్తి కన్నును ఆపరేషన్ ద్వారా అమెరికా శాస్త్రవేత్తలు ఎవరికి విజయవంతంగా మార్చారు.?
జ : జేమ్స్ అనే వ్యక్తికి
8) ఏ సముద్రంలో అగ్నిపర్వతం విస్పోటనం చెందడంతో కొత్త ద్వీపం ఏర్పడింది.?
జ : జపాన్ సముద్రం
9) హైదరాబాద్ టీ హబ్ కు సంబంధించిన ఏ స్టార్టప్ కు నాస్కామ్ అవార్డు దక్కింది.?
జ : బ్లూసఫైర్
10) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక టీబీ (క్షయ) కేసులు ఏ దేశంలో నమోదు అవుతున్నాయి.?
జ : భారత్ (27%)
11) ఆధార్ తో అనుసంధానం కానీ ఎన్ని పాన్ కార్డులను రద్దు చేసినట్లు సిబిడిటి పేర్కొంది.?
జ : 11.5 కోట్లు
12) ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ లలో ఎన్ని డబుల్ సెంచరీలు నమోదయ్యాయి.?
జ : మూడు
13) వన్డే ప్రపంచ కప్ లో వరుసగా 9 మ్యాచ్ లు గెలిచి భారత్ రికార్డు సృష్టించింది. 11 వరుస విజయాలతో ఎ జట్టు పేరిట రికార్డు ఉంది.?
జ : ఆస్ట్రేలియా
14) ఒక వరల్డ్ కప్ సెషన్ లో అత్యధిక వికెట్లు (16*) తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవీంద్ర జడేజా (2023)