07 అక్టోబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) నోబెల్ శాంతి బహుమతి 2022 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : అలెస్ బైలియాత్సికి(బెలారస్), సెంటర్ ఫర్ లిబర్టీస్ సంస్థ (ఉక్రెయిన్), మోమోరియల్ సంస్థ (రష్యా)

2) భారత రూపే కార్డు ను ఏ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒప్పందం కుదిరింది.?
జ : ఒమన్

3) పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం దేశంలో మొదటి రోఫ్ వే ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
జ : వారణాసి

4) కోవిడ్ 19 వ్యాక్సిన్ లను సరఫరా చేసేందుకు ఉపయోగించిన మొదటి డ్రోన్ ఏది.?
జ : ‘ i – డ్రోన్’

5) బీహారీ పురష్కార్ – 2022 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : డా. మాదవ్ హడ

6) అక్టోబర్ 21న జీఎస్‌ఎల్‌వీ – మార్క్ – 3 రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.?
జ : 36

7) చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిరోధక చట్టం (UAPA) ప్రిసైడింగ్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ దినేష్ కుమార్ శర్మ

8) ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా ఏ బ్యారేజీ కి గుర్తింపు దక్కింది.?
జ : ధవళేశ్వరం – ఆంధ్రప్రదేశ్

9) ఆర్బీఐ భారత్ లో డిజిటల్ కరెన్సీ ని ఏ పేరుతో విడుదల చేయనుంది.?
జ : ఈ – రూపీ

10) సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేసే దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 5వ స్థానంలో

11) WTO ప్రకారం 2022 – 2౩ లో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి రేటు ఎంత.?
జ : 3.5%

12) తాజాగా శాస్త్రవేత్తలు అంగారక గ్రహం ఏ ధృవంలో ద్రవ స్థితిలోని నీటిని కనుగొన్నారు.?
జ : దక్షిణ గ్రహం మీద

13) ఇటీవల నాసా యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ ఎంతమందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది.?
జ : 4గురు