31 జూలై కరెంటు అఫైర్స్ Q.A.

1) బంగ్లాదేశ్ లో భారత హై కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రణయ్ వర్మ

2) క్రికెట్ ఆసియా కప్ 2022 నిర్వహణ ను శ్రీలంక నుండి ఏ దేశానికి తరలించారు.?
జ : యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్

3) ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తాజాగా ఏ దేశాన్ని సందర్శించారు.?
జ : భూటాన్

4) 2021 – 22ఆర్థిక సంవత్సరానికి భారత్ FDI లలో 27.01% తో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : సింగపూర్

5) 2021 – 22ఆర్థిక సంవత్సరానికి భారత్ FDI ల ఆకర్షణలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : కర్ణాటక, మహారాష్ట్ర

6) ఆగస్టు 1 – 4 వరకు భారత్ ను సందర్శించనున్న మాల్దీవులు దేశ అధ్యక్షుడు ఎవరు.?
జ : ఇబ్రహీం మహ్మద్ సోల్హే

7) పామ్ ఆయిల్ వినియోగం పై తాజాగా భారత్ ఏ దేశంతో MoU కుదుర్చుకుంది.?
జ : మలేషియా

8) తమిళనాడు లో ఎన్నో చెస్ ఒలింపియాడ్ పోటీలు జరగుతున్నాయి.?
జ : 44వ

9) 22వ కామన్వెల్త్ గేమ్స్ – 2022 బర్మింగ్ హామ్ లోని ఏ స్టేడియంలో ప్రారంభమయ్యాయి.?
జ : అలెగ్జాండర్ స్టేడియంలో

10) కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో తొలిసారిగా పాల్గోంటూ బంగారు పథకాన్ని గెలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : జెర్మీ లాల్ రినుంగా

11) జెర్మీ లాల్ రినుంగా కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో ఏ విభాగంలో స్వర్ణ పథకం సాదించాడు.?
జ : పురుషుల 67 కేజీల వెయిట్ లిప్టింగ్

12) కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో బింద్యారాణి దేవి వెయిట్ లిప్టింగ్ లో ఏ పథకాన్ని సాదించింది.?
జ : రజత పథకం (55 కేజీల విభాగంలో)

13) ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ‘చీఫ్ మినిస్టర్ బ్రేక్ పాస్ట్ పథకం’ ఏ రాష్ట్రంలోని పాఠశాలలో ప్రారంభించారు.?
జ : తమిళనాడు

14) ఈజిప్టు ప్రభుత్వంతో భారత్ కు చెందిన ఏ కంపెనీ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 8 బిలియన్ డాలర్ల ‘సూయజ్ కెనాల్ ఎకానమిక్ జోన్’ MoU కుదుర్చుకుంది.?
జ : రెన్యూ పవర్

15) విదేశీ శాటిలైట్ లను అంతరిక్షంలో కి పంపడం ద్వారా ఇస్రో ఎన్ని మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.?
జ : 279 మిలియన్ డాలర్లు

16) ఇటీవల సకురాజిమా అగ్ని పర్వతం లావాను ప్రమాదకర స్థాయిలో విడుదల చేస్తుంది. ఇది ఏ దేశంలో ఉంది.?
జ : “జపాన్

17) జూలై 28 నుండి రెండు రోజుల పాటు భారత విదేశాంగ మంత్రి ఏ దేశంలో పర్యటించనున్నారు.?
జ : ఉజ్బెకిస్తాన్