DAILY CURRENT AFFAIRS 15th JANUARY 2023

DAILY CURRENT AFFAIRS 15th JANUARY 2023

1) వన్డే క్రికెట్ లో పరుగుల పరంగా అతి భారీ రికార్డు విజయాన్ని టీమిండియా శ్రీలంకపై సాదించింది. ఎన్ని పరుగుల తేడాతో గెలిపించింది.?
జ : 317 పరుగుల తేడాతో

2) ఇటీవల మృతి చెందిన 8వ నిజాం పేరు ఏమిటి.?
జ : ముకరం ఝా

3) జనవరి 15న ఎక్కడ నుండి ఎక్కడకుప్రయాణించే వందేభారత్ సెమీ హైస్పీడ్ రైల్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు.?
జ : సికింద్రాబాద్ – విశాఖపట్నం

4) గోల్డేన్ ఫీకాక్ సీఎస్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ 2022 గెలుచుకున్న కంపెనీ ఏది.?
జ : జిందాల్ స్టీల్ & పవర్

5) భారత సైనిక దినోత్సవం ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 15

6) జనవరి 15న సైనిక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.?
జ : బ్రిటిషర్ల నుండి భారత ఫీల్డ్ మార్షల్ కేయం కరియప్ప సైన్యం భాద్యతలు స్వీకరించారు

7) 71వ మిస్ యూనివర్స్ 2022 పోటీలలో టైటిల్ దక్కించుకున్న సుందరి ఎవరు.?
జ : ఆర్ బోనీ గాబ్రియోల్ (అమెరికా)

8) దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు 2023 కు తెలంగాణ తరపున ఎవరు హజరవుతున్నారు.?
జ : మంత్రి కేటీఆర్

9) వన్డేల్లో అత్యదిక పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మన్ గా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ (12,754)

10) 72 మంది మృతి చెందిన విమాన ప్రమాదం ఏ దేశంలో జరిగింది.?
జ : నేపాల్

11) శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు గెలుచుకున్నారు.?
జ : విరాట్ కోహ్లి

12) భూమికి 41 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి మరొక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. దాని పేరు ఏమిటి.?
జ : LHS – 475

13) మాత శిశు సంరక్షణ కోసం వాయిస్ కాలింగ్ తో సంరక్షణ చర్యలు అందించే సేవలను ఇటీవల తెలుగు భాషలో కేంద్రా ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : కిల్కారి (చిన్నారి చిరునవ్వు)

14) 1949 తర్వాత సైనిక దినోత్సవం కార్యక్రమాన్ని డిల్లీ కాకుండా తొలిసారిగా ఈ సంవత్సరం ఎక్కడ నిర్వహించారు.?
జ : బెంగళూరులో