కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త వినిపించింది. సంవత్సరం కాలంగా వాయిదా పడుతున్న క‌రువు భ‌త్యం ( DA ) పెంపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార‌సుల మేర‌కు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ పెంచిన డీఏ 2021, జులై 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది. డీఏ కోసం గ‌త కొద్ది నెల‌ల నుంచి ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు కేంద్రం నిర్ణ‌యం ఎంతో ఊర‌ట‌నిచ్చింది.