BIKKI NEWS (OCT. 30) : DA INCREASED TO 26.39% . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్ దారులకు డియర్ నెస్ అలవెన్స్ 3.64% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం డిఏ మూలవేతనంలో 26.39 శాతానికి పెరిగింది.
DA INCREASED TO 26.39%
పెంచిన డీఏ ను ఉద్యోగస్తులకు నవంబర్ 2024 వేతనం నుండి అమలు చేయనున్నారు. అనగా డిసెంబర్ 2024 మొదటి తారీఖున పెంచిన వేతనాన్ని తీసుకోమన్నారు.
ఇది 2022 జూలై మాసానికి సంబంధించినది. కావున 2022 జూలై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న ఏరియర్స్ ను పాత పెన్షన్ ఉద్యోగులకు వాళ్ల జిపిఎఫ్ ఎకౌంట్ లో కలపనున్నారు. నూతన పెన్షన్ ఉద్యోగులకు 10 శాతం సిపిఎస్ అకౌంట్లో జమచేసి మిగతా 90 శాతాన్ని 17 వాయిదాలలో చెల్లించనున్నారు.