Home > EMPLOYEES NEWS > DA NEWS – ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

DA NEWS – ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

BIKKI NEWS (JUNE 23) : తెలంగాణ ట్రాన్స్కో ఉద్యోగులకు మూడు శాఖ డి ఏ డియర్ నెస్ అలవెన్స్ ను పెంచుతూ (DA 3% INCREASED TO TRANSCO EMPLOYES) సంస్థ సిఎండి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డీఏ జనవరి 2024 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. పెన్షన్ దారులకు కూడా డిఏ పెంచుతునట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

DA 3% INCREASED TO TRANSCO EMPLOYES

ప్రస్తుతం ఇస్తున్న 8.7 శాతం డీఏ మూడు శాతం పెరుగుదలతో 11.7 శాతానికి చేరినట్లు అయ్యింది. జనవరి నుండి బకాయి పడ్డ డిఏ బిల్లులను 11 వాయిదాలలో చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 2024 సంబంధించిన డిఎను వచ్చే నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్లు సమాచారం. డి ఏ పెంపుదల పట్ల ట్రాన్స్ కో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. జూలై మాసం వస్తే 5 డి ఏ లు పెండింగ్ లో ఉన్నట్లు అవుతుంది.

ఈ నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు… ముఖ్యమంత్రికి, మంత్రులకు, , అధికారులకు వివిధ సందర్భాలలో డీఏ విడుదలపై విజ్ఞప్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో డీఏ ల విడుదల ఉండే అవకాశం ఉంది.

అలాగే ఐఆర్ ను అయిదు శాతంగా గత ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని కూడా పెంచాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అలాగే పిఆర్సి నివేదికను తెప్పించుకొని పిఆర్సి అమలు చేయాలని కూడా ప్రభుత్వనికి వివిధ ఉద్యోగ సంఘాలు నిరంతరం విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం మీద కూడా ప్రభుత్వం నిర్ణయం కోసం ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.