D – PHARMACY ADMISSIONS : డీఫార్మసీ అడ్మిషన్లు

విజయవాడ (ఆగస్టు – 14) : ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఫార్మసీ కళాశాలల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది.

అర్హతలు : ఇంటర్మీడియట్(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్ఈ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం : ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తు

చివరి తేదీ: 19-08-2023.

తరగతుల ప్రారంభం 11-09-2023.

వెబ్ సైట్:https://apsbtet.in/pharmacy/