హైదరాబాద్ (జూన్ 16) : సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సుల ఆన్లైన్ శిక్షణకు (cyber security courses in hyderabad) కొరకు జూన్ 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీర్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు అని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన వారికి దేశ, విదేశాలలో ఐటీ, ఇన్ఫర్మేషన్ రంగం, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజినీర్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. వివరాలకు 7893141797 లో సంప్రదించాలని సూచించారు.
◆ వెబ్సైట్ : www.nacsindia.org