CURRENT AFFAIRS IN TELUGU 8th FEBRUARY 2023

1) మ్యాజికల్ కెన్యా లేడిస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ – 2023 విజేతగా 4వసారి ఎవరు నిలిచారు.?
జ : ఆధితి అశోక్

2) ఆర్.బి.ఐ ద్రవ్యపరపతి సమీక్ష విధానంలో రేపోరేటును 25, బేసీస్ పాయింట్లు పెంచడంతో ఎంత శాతానికి పెంచింది.?
జ : 6.5%

3) ఆర్.బి.ఐ తాజా నివేదిక ప్రకారం 2023 24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు ఎంత.?
జ : 7%

4) ప్రస్తుతం ఆర్.బి.ఐ రివర్స్ రెపో రేటును ఎంత శాతానికి పరిమితం చేసింది.?
జ : 3.35%

5) అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదిక ప్రకారం 2025 నాటికి సగం ఇంధనాన్ని ఏ ఖండం వినియోగించనుంది.?
జ : ఆసియా ఖండ

6) చిన్నచిన్న ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను చేసి రిపోర్ట్ లను ఇవ్వడం కోసం ‘హెల్త్ ఎటిఎం’ లను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు.?
జ : ఉత్తరప్రదేశ్

7) బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ఇటీవల మాట్లాడిన విదేశీ అధ్యక్షుడు ఎవరు.?
జ : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కి

8) ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంట్లో ధరించిన నీలిరంగు జాకెట్ వేటితో తయారు చేయబడింది.?
జ : వ్యర్థ ప్లాస్టిక్ బాటిల్స్ తో

9) ఇటీవల ఫీడే మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిని ఎవరు.?
జ : సాహితి వర్షిణి

10) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023ను ఐసీసీ ఎక్కడ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఇంగ్లాండ్ – ఓవల్ మైదానం

11) వేడి వాయువులను విద్యుత్ శక్తిగా మార్చే హైపర్ సోనిక్ జనరేటర్ ను తయారుచేసిన దేశం ఏది.?
జ : చైనా

12) 1.10 లక్షల కోట్లతో ఎన్టిపిసి ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ జిల్లాలో భారీ పరిశ్రమలను స్థాపించనుంది.?
జ : అనకాపల్లి జిల్లా

13) ఐక్యరాజ్యసమితికి చెందిన యు ఎన్ డి పి తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా ఏ ప్రాంతం మారుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది.?
జ : సబ్ సహరన్ ఆఫ్రికా

14) ఇటీవల కేంద్రం ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణ అప్పు ఎంత.?
జ ; 3.66 లక్షల కోట్లు

15) ఏ విటమిన్ అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం నుండి రక్షణ పొందవచ్చని ఇటీవల శాస్త్రవేత్తలు తెలిపారు.?
జ : విటమిన్ డి

16) ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ఎవరు నిలిచారు.?
జ : నటాషా పెరియానాయగమ్

17) అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున ఆడి సెంచరీలు చేసిన ఆటగాళ్లు ఎవరు.?
జ : గ్యారీ బ్యాలెన్స్ (ZIM & ENG), కెఫ్లర్ వెసెల్స్ (AUS & SA)

18) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా టి20 కెప్టెన్ ఎవరు.?
జ : అరోన్ ఫించ్

19) అత్యధిక గ్రామీ అవార్డులను అందుకున్నది ఎవరు?
జ : బియాన్స్ 32

20) భారత ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం భారత్ లో జనవరిలో నిరుద్యోగ రేటు ఎంత శాతంగా నమోదయింది.?
జ : 7.14%

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @