BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 6th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 6th NOVEMBER 2024
1) ప్రతిభగల విద్యార్థులకు అవసరమైన పూర్తి విద్యా రుణాన్ని ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పొందే ఏ పథకాన్ని కేంద్రం ప్రారంభించనుంది.?
జ : పీఎం-విద్యాలక్ష్మి పథకం
2) డైరెక్ట్ టూ డివైజ్ (D2D) సాంకేతికత ద్వారా సిమ్ కార్డుల అవసరం లేకుండా, మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్, మెసేజ్‌లు చేసుకునే సాంకేతికతను ఏ నెట్వర్క్ ప్రారంభించనుంది.?
జ BSNL
3) అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : డోనాల్డ్ ట్రంప్
4) అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఎన్నిక్మయ్యారు.?
జ : జేడీ వాన్స్
5) తొట్టతొలిసారి జపాన్ శాస్త్రవేత్తలు కలపతో తయారు చేసిన శాటిలైట్ లిగ్నోశాట్ ను ఏ స్ఫేస్ సెంటర్ ద్వారా నింగిలోకి పంపారు.?
జ : ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా
6) ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకపు రేటు స్థానికంగా ఎంతగా నమోదైంది.?
జ : 84.31 రూపాయలు
7) ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ వృద్ధి ఎంత శాతానికే పరిమితం కావచ్చని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేశారు.?
జ : 6.5 %
8) స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తన సుదీర్ఘ కెరీర్ ఏ మ్యాచ్ తో ముగించనున్నాడు.?
జ : డేవిస్ కప్ ఫైనల్స్‌తో
9) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగులలో బ్యాటింగ్ బౌలింగ్ లలో తొలి స్థానంలో నిలిచారు.?
జ : జో రూట్, రబాడా
10) ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నిమా రింజి షెర్ఫా (నేపాల్)
11) ఇంటర్నేషనల్ సోలార్ అలయొన్స్ అధ్యక్ష భాధ్యతను 2024 – 26 కు ఏ దేశం తీసుకుంది.?
జ : ఇండియా
12) ఇంటర్నేషనల్ సోలార్ అలయొన్స్ ఉపాధ్యక్ష భాధ్యతను 2024 – 26 కు ఏ దేశం తీసుకుంది.?
జ : ఫ్రాన్స్
13) అంబాలా లో భారత్ – వియాత్నాం దేశాల మద్య జరుగుతున్న సైనిక విన్యాసాల పేరేమిటి.?
జ : VIN-BAX – 2024
14) ఏ దేశం తో రష్యా తాజాగా సైనిక ఒప్పందం చేసుకుంది.?
జ : ఉత్తర కొరియా
15) అమెరికా కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సారా మెక్ బ్రైడ్ (డెలవేర్ నుండి)
16) అమెరికా ఎన్నికలు 2024 లో ఎంతమంది ప్రవాస భారతీయులు ఎన్నికయ్యారు.?
జ : ఆరుగురు
17) 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో 6000 పరుగులు, 400 వికెట్లు తీసిన క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జలజ్ సక్సేనా (కేరళ)