1) ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం 2022- 23 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7%
2) భారత్ లో సెప్టెంబర్ మాసంలో ద్రవ్యోల్బణం ఎంత శాతంగా ఉంది.?
జ : 6.5%
3) ప్రపంచంలోనే అతిపెద్ద సఫారీ పార్క్ (10వేల ఎకరాలు) ను ఆరావళీ ప్రాంతంలో ఏ రాష్ట్రం అబివృద్ది చేయడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : హర్యానా
4) ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవలను ఎక్కడ ప్రారంభించారు.?
జ : న్యూడిల్లీ
5) ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు.?
జ : శక్తికాంత దాస్
6) తొలి ఎలక్ట్రిక్ విమానం “ఎలీస్ ” తయారు చేసిన సంస్థ పేరు ఏమిటి.?
జ : ఏవియోషన్ ఎయిర్ క్రాప్ట్ (ఇజ్రాయెల్)
7) భారత్ తాజాగా ఏ పురాతన గుహలను యూనెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చడానికి ప్రయత్నం చేస్తుంది.?
జ : బారాబార్, నాగార్జునుడి గుహలు
8) అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలను ఎన్ని నగరాలలో ప్రారంభించారు.?
జ : 8 నగరాలు
9) సెప్టెంబర్ నెలలో వసూలు అయిన జీఎస్టీ ఎంత.?
జ : 1.47 లక్షల కోట్లు
10) సెప్టెంబర్ లో దేశంలో నమోదు అయిన నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 6.3%
11) టెస్లా కంపెనీ అభివృద్ధి చేసిన రోబో పేరు ఏమిటి.?
జ : ఆప్టిమస్
12) విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయనున్న కేంద్రపాలిత ప్రాంతం ఏది.?
జ : పుదుచ్చేరి
13) స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండవ స్థానంలో
14) తెలంగాణ నుండి యూనెస్కో గుర్తింపు పొందిన చేనేత వస్త్రాలు ఏవి.?
జ : సిద్దిపేట గొల్లభామ, హిమ్రూ, నల్ల గొర్రెల గొంగడి
15) “21వ శతాబ్దం కోసం తయారు చేసిన చేనేత వస్త్రాలు” పేరుతో యూనెస్కో విడుదల చేసిన నివేదిక లో భారత్ లో ఎన్ని చేనేత వస్త్రాలకు చోటు దక్కింది.?
జ : 47
16) మహాత్మా గాంధీ హోలో గ్రామ్ తో అక్టోబర్ 1న ఎక్కడ విద్య పై ప్రసంగించారు.?
జ : ఐరాస