Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 5th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 5th NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 5th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 5th NOVEMBER 2024

1) వరంగల్‌ భద్రకాళి ఆలయంలో నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ఏ సర్టిఫికెట్ ప్రదానం చేసింది.?
జ : ఈట్‌ రైట్‌ ప్లేస్‌ సర్టిఫికెట్‌ను

2) ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనం కుదరదంటూ చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీం కోర్టు ధర్మాసనంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత.?
జ : 9 మంది (7 గురు ఈ తీర్పుకు ఆమోదం తెలిపారు.)

3) భారత్ బ్రాండ్ గోధుమ పిండి కిలో ఎన్ని రూపాయలకే అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 30 రూపాయలకే

4) గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 43 బ్యాంకుల సంఖ్య ఎంతకు తగ్గనుంది.?
జ : 28 కి

5) న‌వంబ‌ర్ 24, 25వ తేదీల్లో 18వ సీజన్ ఐపీఎల్ వేలం ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : జెడ్డా

6) ఆఫ్రో – ఆసియా క‌ప్‌ను నిర్వ‌హించేందుకు ఏ క్రికెట్ సంఘం సన్నాహాలు ప్రారంభించింది.?
జ : ఆఫ్రికా క్రికెట్ సంఘం

7) ఫిక్సింగ్ ఆరోపణలతో ఏ ప్రీమియ‌ర్ లీగ్‌ లో 24 మంది ఆటగాళ్ల పై నిషేధం విధించారు.?
జ : మిజోరం ప్రీమియ‌ర్ లీగ్‌

8) జపాన్ ప్రయోగించిన పూర్తిగా కలపతో తయారు చేసిన ఉపగ్రహం పేరు ఏమిటి.?
జ : లిగ్నోశాట్

9) ప్రో కబడ్డీ లీగ్ లో 1000 రెయిడ్ పాయింట్లు సాదించిన ఆటగాడు ఎవరు.?
జ : అర్జున్ దేశ్యాల్ (జైపూర్ పింక్ పాంథర్స్)

10) WBF టైటిల్ నెగ్గిన భారత బాక్సర్ ఎవరు.?
జ : మన్‌దీఫ్ జాంగ్రా

11) ఏ కన్నడ షార్ట్ ఫిల్మ్ 97వ ఆస్కార్ అవార్డులకు భారత్ నుంచి ఎంపికయింది.?
జ : Sunflower were the First one to know.

12) 2024 – 25 లో ఖరీఫ్ సీజనలో వరి దిగుబడి లో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 5 వ స్థానంలో (యూపీ మొదటి స్థానంలో)

13) ఏ యూరోప్ ఉపగ్రహాలను డిసెంబర్ 2024 లో ఇస్రో ప్రయోగించనుంది.?
జ : ప్రోబా – 3

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు