30 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ను ఎప్పటినుండి అమలు చేయనుంది.?
జ : అక్టోబర్ – 01 – 2022

2) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 ర్యాంకింగ్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 40వ స్థానంలో

3) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022 ర్యాంకింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?
జ : స్విట్జర్లాండ్

4) స్వచ్ఛ బడి చెత్త సేకరణ, నిర్వహణలో భారత దేశంలో రెండవ స్థానంలో నిలిచిన పట్టణము ఏది.?
జ : సిద్దిపేట

5) భారత దేశంలోనే అతి పెద్దదైన 10 ఎకరాల్లో మియావాకి పార్కును ఎక్కడ నిర్మించారు.?
జ : హైదరాబాద్

6) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్ల ను పెంచడం ద్వారా ప్రస్తుతం రెపో రేట్ ఎంతగా ఉంది.?
జ : 5.9%

7) రేపో రేటు అనగానేమి.?
జ : రిజర్వ్ బ్యాంకు ఇతర బ్యాంకులకు ఇచ్చే అప్పుల మీద వసూలు చేసే వడ్డీ రేటు

8) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవ వందే భారత్ రైలును ప్రారంభించారు. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది.?
జ : గాంధీనగర్ – ముంబై

9) మొదటి రెండవ వందే భారత్ రైళ్లను ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తాయి.?
జ : 1) న్యూ ఢిల్లీ నుండి వారణాసి 2) న్యూ ఢిల్లీ నుండి శ్రీ మాత వైష్ణో దేవి ఆలయం

10) జాతీయ మహిళా కమిషన్ కు మొదటి చైర్పర్సన్ గా పనిచేసిన జయంతి పట్నాయక్ ఇటీవల మరణించారు ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు.?
జ : ఒడిశా

11) ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ (EGR) లను ఉపయోగించడానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) ఏ సంస్థ నుంచి అనుమతి పొందింది.?
జ : SEBI

12) బ్రిటానియా ఇండస్ట్రీస్ యొక్క నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజ్ నీత్ సింగ్ కోహ్లీ

13) 36వ జాతీయ క్రీడలను ఏ నగరంలో నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
జ : అహ్మదాబాద్

14) 36వ జాతీయ క్రీడలలో ఎన్ని క్రీడాంశాలలో పోటీలు జరగనున్నాయి.?
జ : 35

15) 36వ జాతీయ క్రీడలలో తొలగించబడిన మరియు నూతనంగా చేర్చబడిన క్రీడాంశాలు ఏవి.?
జ : హ్యాండ్ బాల్ తొలగించారు. మాల్కాంభా & యోగాసనా క్రీడాంశాలను ప్రవేశపెట్టారు.

16) ఉగ్రవాద కార్యకలాపాలు నేరుపుతున్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఏ సంస్థను ఐదు సంవత్సరాల పాటు నిషేధించింది.?
జ : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

17) ఉక్రెయిన్ దేశంలోని ఎన్ని ప్రాంతాలను రెఫరండం ద్వారా రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది.?
జ : నాలుగు

18) హైదరాబాదులో ఏ దేశం తన నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది.?
జ : ప్రాన్స్ ( హౌస్ ఆఫ్ ప్రాన్స్)

19) వార్తా సంస్థ PTI డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎల్. ఆదిమూలం

20) విదేశీయులు ఎన్నేళ్లు అమెరికాలో నివాసం ఉంటే గ్రీన్ కార్డ్ పొందటానికి అర్హులంటూ సినైట్ లో బిల్లును ప్రవేశపెట్టారు.?
జ : ఏడేళ్లు

Follow Us @