Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 3rd OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 3rd OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 3rd OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 3rd OCTOBER 2024

1) సుస్థిర వ్యవసాయం, రైతుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కొత్తగా ఏ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపారు.?
జ : పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎం-ఆర్కేవీవై), కృషి ఉన్నతి యోజన పథకాలు

2) ఆత్మ నిర్బర్ పథకం కింద దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే ఏడేండ్ల (2024-25 నుంచి 2030-31) కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.?
జ : రూ.10,103 కోట్లు

3) చెన్నై నగరానికి రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. రూ.63,246 కోట్ల అంచనా వ్యయంతో ఎన్ని కిలోమీటర్ల కు ఆమోదం తెలిపింది.?
జ : 119 కి.మీ

4) తాజాగా ఏ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది.?
జ : మరాఠీ, పాలి, ప్రకృత్, అస్సామీ, బెంగాలీ భాషలు

5) అంతర్జాతీయ స్పేస్‌ మిషన్‌ సంస్థ ‘లూనార్స్‌ రిసెర్చ్‌ స్టేషన్‌’కు అంబాసిడర్‌ ఫర్‌ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : మోహనసాయి ఆకుల(అమర్‌)

6) సింగ‌పూర్ కు ఏ మంత్రికి ఓ కేసులో 12 నెల‌ల జైలుశిక్ష ప‌డింది.?
జ : సుబ్ర‌మ‌ణియం ఈశ్వ‌ర‌న్‌

7) బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో టైప్‌-1 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉన్నదని యూకేలోని ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.?
జ : కార్డిఫ్‌ యూనివర్సిటీ

8) మూడు నెలల క్రితం ఇజ్రాయెల్ జరిపిన ఓ దాడిలో గాజాస్ట్రిప్‌లో హమాస్‌ ప్రభుత్వాధినేతను హతమార్చినట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ గురువారం ప్రకటించింది. అతని పేరు ఏమిటి.?
జ : రౌహి ముష్తాహ

9) ఏ శ్రీలంక స్పిన్న‌ర్ పై యాంటీ క‌రప్ష‌న్ కోడ్ ఉల్లంఘించిన కేసులో;ఏడాది పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి బ్యాన్ విధించారు.?
జ : ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ‌

10) ప్రపంచ శాఖాహార దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 01

11) ప్రపంచ అహింసా దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 02

12) హిందూ మహ సముద్రంలోని 60 దీవుల సమదాయం అయినా ఏ ద్వీప సముదాయం పై హక్కులను బ్రిటన్ మారిషస్ దేశానికి రాసిచ్చింది.?
జ : చాగోస్ దీవులు

13) తాజాగా భారత్ లో మత స్వేచ్ఛ అధ్వాన్నంగా మారిందని ఏ సంస్థ ప్రకటించింది.?
జ : US CIRF

14) కేంద్ర నివేదిక ప్రకారం 2022 – 23 సంవత్సరం లో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ఎంత.?
జ : 2349 యూనిట్లు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు