BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 2nd OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 2nd OCTOBER 2024
1) న్యూజిలాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్సీ కీ రాజీనామా చేసిన ఆటగాడు ఎవరు.?
జ : టిమ్ సౌదీ
2) చైనా ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : కార్లోస్ అల్కరాజ్ (సిన్నర్ పై)
3) తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : భారత్
4) 9వ ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ 2024 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : యూఏఈ
5) విద్యుత్ వాహనాలు కొనుగోలు పెంచేందుకు కేంద్రం తాజాగా 10,900 కోట్లతో ప్రారంభించిన పథకం పేరు ఏమిటి.?
జ : పీఎం ఈ డ్రైవ్
6) దక్షిణ వియాత్నాంలో 47 పులుల ఏ వైరస్ కారణంగా ఇటీవల మరణించాయి.?
జ : బర్డ్ ప్లూ (H5N1)
7) గ్లోబల్ చెస్ లీగ్ 2024 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : ఇంగ్లండ్
8) ప్లూటో కు చెందిన ఏ ఉపగ్రహం పై కార్బన్ డై ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ లను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : చరోన్ పై
9) ప్రశాంత్ కిషోర్ ఏ పేరుతో పార్టీని బీహార్ లో ప్రారంభించారు.?
జ : జన్ సూరజ్
10) ఐక్య రాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఏ దేశం నిషేధం విధించింది. ?
జ : ఇజ్రాయెల్
11) ఏ అమెరికా మాజీ అధ్యక్షుడు వందో పుట్టిన రోజు జరుపుకున్న తొలి యూఎస్ ప్రెసిడెంట్‌గా రికార్డు సృష్టించారు.?
జ : జిమ్మీ కార్టర్
12) ఐసీసీ ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా ఎవరు తాజా ర్యాంకింగులలో నిలిచారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా (అశ్విన్ రెండో స్థానం)
13) పాకిస్థాన్ టీట్వంటీ, వన్డే జట్లకు కెప్టెన్సీ నుండి ఎవరు తప్పుకున్నారు.?
జ : బాబర్ ఆజామ్