BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 2nd NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 2nd NOVEMBER 2024
1) ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : తెలంగాణ
2) ఏ రాష్ట్ర ప్రభుత్వం శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు 5 లక్షల ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.?
జ : కేరళ
3) భారత్ లో ప్యాకేజ్డ్ ఆహారాల్లో ఉప్పు తగ్గిస్తే 3 లక్షల మందిని కాపాడొచ్చు అంటూ ఏ సంస్థ నివేదిక తెలిపింది.?
జ : ప్రపంచ ఆరోగ్య సంస్థ
4) గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును ఎవరు సాధించారు.
జ : అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్సేన్.
5) ఏ రెండు రకాల చెట్ల జాతులు విద్యుత్తు ఉత్పత్తికి అనువైనవని శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : సెన్నా సియామియా, గ్లిరిసిడియా సేపియం
6) ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్లలో ఒకటైన ఏ డైనోసార్ ను ఈ నెల 16న ఫ్రాన్స్ రాజధాని పారిస్లో వేలం వేయనున్నారు.?
జ : వల్కాన్
7) అక్టోబర్ 25తో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ విడుదల చేసిన డేటా పేర్కొంది. ?
జ : 684.805 బిలియన్ డాలర్లు
8) అండర్ -19 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకం గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు.?
జ : భారత యువ బాక్సర్ కృష్ణ వర్మ
9) జీఐ ట్యాగింగ్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేటిని కేంద్రానికి సిఫార్సు చేసింది.?
జ : హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కలంకారీ, వరంగల్ చపాటా మిర్చి
10) బ్రిటన్ విపక్ష నేతగా, కన్సర్వేటీవ్ పార్టీ నేతగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కెమీ బెడ్నాక్
11) టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ టీమ్ ప్రపంచ కప్ 2024 పోటీలు డిసెంబర్ 1 నుండి ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : చెంగ్డూ (చైనా)
12) ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి (18 అడుగుల పొడవు, టన్ను బరువు) మరణించింది. దాని పేరు ఏమిటి.?
జ : కాసియస్ (ఆస్ట్రేలియా)
13) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గడిచిన ఎనిమిది సంవత్సరాలలో భారత్ లో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎంత శాతం తగ్గింది.?
జ : 17.7%