CURRENT AFFAIRS IN TELUGU 2nd FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 2nd FEBRUARY 2023

1) ఫామ్ ఆయిల్ వ్యవసాయ అభివృద్ధి కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుంది.?
జ : నాగలాండ్

2) బాగా వెనుకబడిన గిరిజనుల కోసం “ప్రధానమంత్రి పివిటిజీ డెవలప్మెంట్ స్కీం 2023′ కోసం ఎన్ని కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయించారు.?
జ : 15 వేల కోట్లు

3) కేంద్ర బడ్జెట్ లో “సికెల్ సెల్ ఎనీమియా” ను పూర్తిగా భారత్ నుండి తొలగించడానికి ప్రతిపాదనలు చేశారు .?
జ : 2047

4) దేశంలోని వెనుకబడి ఉన్న విశ్వకర్మల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : PM VIKAS SAMMAN

5) కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే – 2022 ప్రకారం భారతీయుల తలసరి ఆదాయం ఎంత.?
జ : 1.95 లక్షలు

6) కేంద్ర బడ్జెట్ లో రైల్వేకు ఎన్ని నిధులను కేటాయించారు.?
జ : 2.40 లక్షల కోట్లు

7) ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ గడువును నూతన బడ్జెట్ లో ఎన్ని రోజులకు పూర్తి చేయాలని సూచించారు.?
జ : 16 రోజులు

8) కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్ని సంవత్సరాలు పైబడిన గవర్నమెంట్ వెహికల్స్ ను తుక్కు కింద మార్చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : 15 సంవత్సరాలు పైబడిన వెహికల్స్

9) ఏ నది జలాల ఒప్పందాన్ని మార్చాలని పాకిస్తాన్ కు భారతదేశం నోటీసులు జారీ చేసింది.?
జ : 1960 సింధు నది జలాల ఒప్పందం

10) రిపబ్లిక్ డే ఉత్సవాలలో ఏ రాష్ట్ర శకటం పబ్లిక్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.?
జ : గుజరాత్

11) నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు బడ్జెట్ లో ఎన్ని కోట్లు కేటాయించారు.?
జ : 19,700 కోట్లు

12) డేవిస్ కప్ 2023 వరల్డ్ లీగ్ మ్యాచ్ లు ఏ దేశంలో నిర్వహిస్తున్నారు .?
జ : డెన్మార్క్

13) క్రొయేషియాలో జరుగుతున్న జాగ్రేబ్ ఓపెన్ ఛాంపియన్షిప్ రెజ్లర్ పోటీలలో కాంస్య పథకం గెలిచిన భారత రెజ్లర్ ఎవరు.?
జ : అమన్ సెహ్రవత్

14) ఏ దేశం తన ఐదు రూపాయల నోటు పై ఎలిజిబెత్ రాణి – 2 ఫోటోను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఆస్ట్రేలియా

15) వేయిండ్ల నాటి 17వ జైన తీర్దాంకరడు అయినా ‘కుంతునాధ్ ‘ విగ్రహం ఎక్కడ బయటపడింది.?
జ : హింగోలి (మహారాష్ట్ర )

16) కళాతపస్వి కే. విశ్వనాథ్ ఇటీవల మరణించారు ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ సంవత్సరంలో లభించింది.?
జ : 2016

17) మరుగుదొడ్ల నిర్మాణం పంచాయతీల నిర్వహణ స్వచ్ఛ సర్వేక్షన్ విభాగంలో విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా ఏది.?
జ : ఖమ్మం (5వ స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం)

18) ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టే ప్రతి బిడ్డకు 100 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.?
జ : సిక్కిం

19) సిక్కిం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు.?
జ : ప్రేమ్ సింగ్ తమంగ్