BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 29th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 29th OCTOBER 2024
1) జనన, మరణాలను సులువుగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
జ : సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)
2) లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నయీమ్ ఖాసీం
3) క్యాన్సర్ మహమ్మారికి కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం ద్వారా సమర్థంగా క్యాన్సర్ కణతులను నాశనం చేయొచ్చని ఏ యూనివర్సిటీ గుర్తించారు.?
జ : అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు
4) చైనా సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?
జ : బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (49.3 బిలియన్ల డాలర్లు)
5) ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘బాలన్ డి ఓర్’ను 2024లో పురుషుల విభాగంలో ఎవరికి ప్రదానం చేశారు.?
జ : స్పెయిన్ ఫుట్‌బాలర్ రోడ్రిగొ హెర్నాండెజ్
6) ‘బాలన్ డి ఓర్’ అవార్డును 2024లో మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్న్నారు.?
జ : స్పెయిన్‌కుచెందిన ఐటానా బొన్మాటీ
7) ఉత్తమ యువ ఫుట్‌బాలర్ అవార్డు 2024 ఎవరు గెలుచుకున్నారు.?
జ : స్పెయిన్ ఆటగాడు లమినె యమాల్
8) ఆస్ట్రేలియాకు చెందిన ఏ వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.?
జ : మాథ్యూ వేడ్
9) ఏటీపీ ఫైనల్స్‌లో ఆడనున్న నాలుగో భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహన్ బోపన్న
10) దేశంలోనే తొలిసారిగా క్యూ ఆర్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషిన్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : కోల్‌కతా
11) భారత్ లో పర్యటిస్తున్న స్పెయిన్ ప్రభుత్వాదినేత ఎవరు.?
జ : పెడ్రో సాంచెజ్
12) “ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ” అవార్డును ఫీజీ ప్రభుత్వం ఎవరికి అందజేశారు.?
జ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్
13) IUCN సంస్థ ఏ జాతి పెంగ్విన్ లు అంతరించి పోతున్నాయని పేర్కోంది.?
జ : ఆప్రికన్ పెంగ్విన్