BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 28th SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 28th SEPTEMBER 2024
1) తమిళనాడు నూతన డిప్యూటీ సీఎంగా ఎవరిని నియమించారు.?
జ : ఉదయనిధి స్టాలిన్
2) అత్యంత శక్తిమంతమైన క్యాటగిరీ-4 ఏ హరికేన్ తాజాగా అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది.?
జ : హెలెనా
3) ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఏ బ్యాంకు విలీనానికి ఇరు సంస్థల బోర్డులు ఆమోదం తెలిపాయి.?
జ : ఐడీఎఫ్‌సీ
4) మకావు ఓపెన్ సూపర్-300 టోర్నీలో భారత యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీకి ఏ పతకం దక్కింది.?
జ :కాంస్యం
5) IIFA 2024 అవార్డులలో ఔట్ స్టాండింగ్ ఎచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు ఎవరికి ప్రకటించారు.?
జ : చిరంజీవి
6) IIFA 2024 అవార్డులలో గోల్డెన్ లెగసీ అవార్డు ఎవరికి ప్రకటించారు.?
జ : బాలకృష్ణ
7) IIFA 2024 అవార్డులలో వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ప్రకటించారు.?
జ : సమంత
8) మినీ చందమామ గా భావించే ఏ అస్టరాయిడ్ సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు దర్శనం ఇవ్వనుంది.?
జ : అస్టరాయిడ్ 2024 PT5
9) అంతర్జాతీయ టీట్వంటీ లలో ఒక కేలండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : నికోలస్ పూరన్ (2059*)
10) మిజోరాం గవర్నర్ గా తాజాగా ఎవరికి అదనపు భాధ్యతలు అప్పగించారు.?
జ : ఇంద్రసేనారెడ్డి (త్రిపుర గవర్నర్)
11) 360 డీగ్రీలలో రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూప్ జాకెట్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : DRDO
12) స్వలింగ వివాహలకు తాజాగా ఏ దేశం చట్టబద్ధత కల్పించింది.?
జ : థాయిలాండ్
13) స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 23వ స్థానం
14) స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ