CURRENT AFFAIRS IN TELUGU 28th APRIL 2024

CURRENT AFFAIRS IN TELUGU 28th APRIL 2024

1) స్వలింగ సంబంధాలకు పాల్పడిన వారికి 15 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ ఏ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : ఇరాక్

2) చంద్రుని దక్షిణ ధ్రువంపై 2035 నాటికి ఏ దేశం పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంద.?
జ : చైనా

3) ప్రపంచ అందరు – 8 చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచిన భారత చిన్నారి ఎవరు.?
జ : ఆదుళ్ళ దివిత్ రెడ్డి

4) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : అర్జున్ బబూత (254 స్కోర్)

5) మానవ డిఎన్ఏ బ్యాంకు ను తయారు చేసిన ఉత్తర భారతదేశానికి చెందిన యూనివర్సిటీ ఏది.?
జ : బనారస్ హిందూ విశ్వవిద్యాలయం

6) ఇటీవల వార్తల్లోకి వచ్చిన తాంథై వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రానికి చెందినది.?
జ : తమిళనాడు

7) పాకిస్తాన్ ఒక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇషాక్ దార్

8) ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని 2.9 లక్షల కోట్లతో నిర్మించాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : దుబాయ్

9) పాకిస్తాన్ జాతీయ క్రికెట్ వన్డే, టి20 జట్టులకు ఎవరు కోచ్ గా ఎన్నికయ్యారు.?
జ : గారీ కిర్‌స్టెన్

10) ఆర్చరీ ప్రపంచ కప్ 2024 లో పురుషుల రికర్వ్ టీం విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : ధీరజ్, తరుణ్ దీప్‌రాయ్, ప్రవీణ్ జాదవ్

11) ఆర్చరీ ప్రపంచ కప్ 2024 లో మొత్తం భారత్ ఎన్ని స్వర్ణ పథకాలు నెగ్గింది.?
జ : ఐదు స్వర్ణాలు

12) ప్రపంచ నృత్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 29

13) గ్లోబల్ మీడియా అవార్డు గెలుచుకున్న ఇండియా టుడే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ ఎవరు.?
జ : సనా