BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 27th SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 27th SEPTEMBER 2024
1) ఆసియా పవర్ ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 3వ స్థానంలో
2) హురూన్ అండర్ 35 జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు.?
జ : అంకుష్ సచ్‌దేవ (షేర్‌చాట్)
3) 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎంతగా అంచనా వేసింది.?
జ : 7%
4) తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఏ గ్రామాలు నిలిచాయి.?
జ : సోమశిల, నిర్మల్
5) వైజాగ్ స్టీల్‌ను ఏ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.?
జ : సెయిల్
6) ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తాజా నివేదికలో భారత్ లో 15-34 ఏండ్ల మధ్య వయసు ఉండి, పనిచేయగల సామర్థ్యమున్న యువతలో ఎంత శాతం మంది ఏ పనీలేకుండా రోడ్ల మీద తిరుగుతున్నట్టు వెల్లడించింది.?
జ : 25%
7) ఫిలిప్పిన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇర్రి)కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా ఏ రెండు కొత్త వరి రకాలను అభివృద్ధి చేశారు.?
జ : ఇర్రి 147, ఇర్రి 125
8) జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వారసుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : షిగెరు ఇషిబా (67)
9) ఏ దేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అణు జలాంతర్గామి నిర్మాణంలో ఉండగానే నీట మునిగిందని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.?
జ : చైనా
10) కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు వచ్చే ఎడిషన్ నుంచి మెంటార్‌గా ఎవరు వ్యవహరించనున్నారు.?
జ : డ్వెన్ బ్రావో
11) ఆసియా దేశాల్లో (భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్)లో ఎక్కువ వికెట్లు(420) పడగొట్టిన భారత బౌలర్‌గా ఎవరు రికార్డు నెలకొల్పాడు. దాంతో, 419 వికెట్లు తీసిన కుంబ్లే రెండో స్థానానికి పడిపోయాడు.?
జ : రవిచంద్రన్ అశ్విన్
12) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తాజాగా ఏ చిత్రాన్ని ప్రదర్శించారు.?
జ : 12th ఫెయిల్
13) అకాడమీ అవార్డు విజేత, హ్యారీ పోటర్ సినిమా ఫేం ప్రముఖ బ్రిటిష్ నటి కన్నుమూశారు. ఆమె పేరు ఏమిటి.?
జ : మ్యాగీ స్మిత్