Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 27th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 27th OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 27th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 27th OCTOBER 2024

1) ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో తెలంగాణకు చెందిన ఏ చిత్ర కళ గురించి ప్రస్తావించారు.?
జ : సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళ (చేర్యాలకు చెందిన డీ వైకుంఠం 50 ఏండ్లుగా నకాశీ చిత్రకళకు జీవం పోస్తున్నట్టు తెలిపారు.)

2) భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏరోజున పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.?
జ : నవంబర్ 26 – 2024

3) ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీ(ఎన్‌సీఐ)లో భారత్‌ ఎన్నో ర్యాంక్ లో నిలిచింది.?
జ : 176వ ర్యాంక్‌

4) తమిళ నటుడు విజయ్ ప్రారంభించిన రాజకీయ పార్టీ ఏది.?
జ : తమిజగ వెట్రి కజగమ్‌ పార్టీ

5) పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వన్డే, టీట్వంటీ లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పింది.?
జ : మహ్మద్‌ రిజ్వాన్‌

6) జపాన్‌ పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో భారత్‌ ఎన్ని పతకాలు సాధించింది.?
జ : 24 పతకాలు

7) తెలంగాణ ఆర్చరీ అసోసియేషిన్‌ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ప్రముఖ న్యాయవాది టి. రాజు

8) ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : ఆప్ఘనిస్థాన్ ఏ

9) 70 ఏళ్ళు దాటిన వారికి కేంద్రం ప్రారంభించనున్న పథకం పేరు ఏమిటి.?
జ : ఆయుష్మాన్ భారత్ పీఏం జన్ ఆరోగ్య యోజన

10) భారత్ లో జెండర్ రెస్పాన్సివ్ బడ్జెట్ ఎంతశాతం పెరిగిందని ఐరాస నివేదిక వెల్లడించింది.?
జ : 6.8%

11) ఐరాస ఉద్గారాల వ్యత్యాస నివేదిక 2024 ప్రకారం పారిశ్రామిక విప్లవం కంటే ముందు కంటే ఉష్ణోగ్రతలు ఎంత పెరిగాయి.?
జ : 1.3℃

12) అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం 2024 ఎవరికి ప్రకటించారు.?
జ : చిరంజీవి

13) మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అవార్డు 2024 ను ఏ భారతీయ సుందరి గెలుచుకుంది.?
జ : రేచల్ గుప్తా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు