BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 26th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 26th OCTOBER 2024
1) జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని ఎన్నికల సంఘం ప్రకటించింది.?
జ : ఎమ్‌ఎస్ ధోనీ
2) ఫిలిప్పీన్స్‌లో ఏర్పడిన ట్రామీ తుఫాను ఏ రకానికి చెందింది.?
జ : ఉష్ణ మండల తుఫాను
3) మృత్యువును పసిగట్టే కాలిక్యులేటర్ ను ఏ దేశంలో అభివృద్ధి చేశారు.?
జ : బ్రిటన్
4) ఎన్ని సంవత్సరాల తర్వాత భారత్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి పాలైంది.?
జ : 12 ఏండ్లు (కివీస్ పై)
5) సుల్తాన్ జోహర్ కప్‌లో భారత యువ హాకీ జట్టు ఏ పతకం సొంతం చేసుకుంది.?
జ : కాంస్య పతకం
6) ఒకే ఏడాదిలో స్వదేశంలో 1000 పరుగుల మార్క్ అందుకున్న రెండో భారత ఆటగాడిగా ఎవరు చరిత్ర సృష్టించాడు.?
జ : యశస్వీ జైశ్వాల్ (మొదటి ఆటగాడు గుండప్ప విశ్వనాథన్)
7) ICRI డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హిమాన్స్ పాఠక్
8) ఎస్బీఐ నివేదిక ప్రకారం 5 లక్షల లోపల ఆదాయం ఉన్నవారిలో 2014 – 23 ఆదాయ అసమానతలు ఎంత శాతం తగ్గాయి.?
జ : 74.2%
9) ఎడిటర్స్ గిల్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు.?
జ : అనంత్ నాథ్
10) గ్లోబల్ ఫైనాన్స్ మేగజైన్ నివేదిక ప్రకారం 2024 లో భారత్ లో బెస్ట్ బ్యాంకు ఏది.?
జ : ఎస్బీఐ
11) ఎవరి జయంతి సందర్భంగా రెండు సంవత్సరాల పాటు ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్
12) గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్ షిప్ అవార్డు 2024 ఎవరికి అందజేశారు.?
జ : ఊర్మిలా చౌదరి (నేపాల్)