BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 25th SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 25th SEPTEMBER 2024
1) ప్రపంచంలో ఎంబీఏ కోర్సులు అందించే అత్యుత్తమ 100 సంస్థల్లో తెలంగాణ నుంచి స్థానం పొందిన సంస్థ ఏది.?
జ : హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
2) చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్ కారణంగా భూ పరిభ్రమణ వేగం ఎన్ని మైక్రో సెకండ్లు తగ్గిందని నాసా సైంటిస్టులు గుర్తించారు.?
జ : 0.06 మైక్రో సెకండ్లు
3) చైనా తాజాగా ఏ కమర్షియల్ రాకెట్ ద్వారా అయిదు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.?
జ : లిజియన్-1
4) ప్రతిష్ఠాత్మక ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : భారత వెటరన్ క్యూయిస్టు కమల్ చావ్లా
5) ఒక ఇన్నింగ్స్‌లో 498 పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన యువ క్రికెటర్ ఎవరు.?
జ : ద్రోణ దేశాయ్ (గుజరాత్)
6) అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక మౌంట్ గోరిచెన్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ వాసి ఎవరు.?
జ : యశ్వంత్
7) చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎవరి పేరును పెడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.?
జ : ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’
8) సినిమాలలో అత్యధిక స్టెప్పులు వేసినందుకు గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నటుడు ఎవరు.?
జ : చిరంజీవి
9) ఫెడరల్ బ్యాంకు నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కేవీఎస్ మణియన్
10) పాకిస్థాన్ గూఢచర్య విభాగం ISI అధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహ్మద్ అసిం మాలిక్
11) అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది..?
జ : రష్యా (5500)
12) భారత్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి.?
జ : 172
13) ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన హెజుబుల్లా క్షిపణి విభాగం అధిపతి ఎవరు.?
జ : ఇబ్రహీం ఖుబైసీ