BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 25th OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 25th OCTOBER 2024
1) ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి ప్రసిద్ది చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహించిన ఏ తెలంగాణ వాసి ఇటీవల మరణించారు.?
జ : కనగరాజు
2) 2022 జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన దాదాపు ఎన్ని వేల మంది భారతీయుల ఆచూకీ గల్లంతయ్యిందని ఓ నివేదిక వెల్లడించింది.?
జ : 29 వేలు
3) ఆన్‌లైన్ పేమెంట్స్ విధానంలో అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ‘పామ్ పేమెంట్స్’ ను ఏ దేశం అందుబాటులోకి తీసుకొచ్చింది.?
జ : చైనా
4) ప్రపంచంలోనే అతి పెద్ద భవన నిర్మాణం ఏ పేరుతో ఏ దేశంలో ప్రారంభమైంది.?
జ : ‘ది ముకాబ్’ పేరుతో సౌదీ అరేబియాలో
5) అక్టోబర్ 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.?
జ : 688.26 బిలియన్ డాలర్లకు
6) బంధన్ బ్యాంక్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా
7) 2018 సాండ్‌పేపర్ గేట్ వివాదంలో ఎవరిపై ఉన్న లైఫ్‌టైమ్ కెప్టెన్సీ, లీడర్‌షిప్ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా ఎత్తివేసింది.?
జ : డేవిడ్ వార్నర్
8) భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ఖోఖో ప్రపంచకప్‌లో ఎన్ని జట్లు పాల్గొననున్నాయి.?
జ : 24 జట్లు
9) ముద్రా రుణపరిమితి ని ఎన్ని లక్షలకు కేంద్రం పెంచింది. ?
జ : 20 లక్షలు
10) దేశవ్యాప్తంగా ఎన్నో పశుగణన తాజాగా ప్రారంభమైంది.?
జ : 19వ
11) రచయిత ల కోసం ఒక ప్రత్యేక గ్రామాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.?
జ : ఉత్తరాఖండ్
12) ఏ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్దాల తో 30 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం చేపట్టారు.?
జ : ఉత్తరప్రదేశ్
13) భారత పర్యటన కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఎవరు. ?
జ : ఒలాఫ్ షోల్జ్
14) యూఎస్ గ్రాండ్ ప్రిక్స్ 2024 ఫార్ములా వన్ విజేత ఎవరు.?
జ : చార్లెస్ లెక్లార్క్
15) HSBC కి మొట్టమొదటి మహిళ CFO గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పామ్ కౌర్