CURRENT AFFAIRS IN TELUGU 25th JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 25th JANUARY 2023

1) 2023 సంవత్సరానికి ఎంతమందికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది.
జ : పద్మ విభూషణ్(6), పద్మభూషణ్(9), పద్మశ్రీ (91)

2) ఏ రాష్ట్ర ప్రభుత్వం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలను వివాహం చేసుకున్న వారికి ఫోక్సో చట్ట ప్రకారం శిక్ష విధిస్తామని పేర్కొంది.?
జ : అస్సాం

3) ఏ విమానాశ్రయానికి “బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం 2023 అవార్డు” దక్కింది.?
జ : గోవా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్

4) ఉత్తర కొరియా మానవ హక్కుల రాయబారిగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఎవరిని నియమించారు.?
జ : జూలీ టర్నర్

5) షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ఫిలిం ఫెస్టివల్ జనవరి 27 నుంచి 31వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : ముంబై

6) ఐసీసీ టి20 అంతర్జాతీయ టీం 2022లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న క్రికెటర్లు ఎవరు.?
జ : కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హర్దీక్ పాండ్యా

7) తాజాగా తెలంగాణ రాష్ట్ర అర్థగనాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత.?
జ : 19.4%

8) బ్లూమ్బెర్గ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ కుబేర్లలో గౌతమ్ ఆదాని ఎన్నో స్థానంలో నిలిచారు.?
జ : 4వ స్థానంలో

9) ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ తాజా నివేదిక ప్రకారం “ఆహార అభద్రత” ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతంగా నమోదయింది.?
జ : 29% (2014 లో 21%)

10) గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ను నిరోధించడానికి సీరం ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన HPV టీకాను ఏ పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు.?
జ : సర్వోవ్యాక్

11) గ్లోబల్ ఎంటర్ప్రైన్షిప్ మానిటర్ (GEM) నివేదిక ప్రకారం సులభంగా నూతన వ్యాపారాలను ప్రారంభించే దేశాల జాబితాలో భారత స్థానం ఎంత.?
జ : 4వ స్థానం

12) కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 2022 – 23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలు ఎన్ని లక్షల కోట్లు.?
జ : 147.19 లక్షల కోట్లు

13) ఐసీసీ 2022 క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : సూర్య కుమార్ యాదవ్

14) ఐసీసీ 2022 ఎమర్జింగ్ మహిళ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : రేణుకా సింగ్

15) సి నారాయణ రెడ్డి 2023 సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు.?
జ : కుప్పిలి పద్మ