BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 24th SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 24th SEPTEMBER 2024
1) ఎస్సీ అట్రాసిటీ కేసులలో అగ్రస్థానంలో ఉన్న మూడు రాష్ట్రాలు ఏవి.?
జ : ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మద్యప్రదేశ్
2) ఒకే టెస్టు వేదికపై రెండు సార్లు సెంచరీ మరియు 5 వికెట్ల ప్రదర్శన చేసిన ఏకైక ఆటగాడు ఎవరు.?
జ : రవిచంద్రన్ అశ్విన్
3) చెస్ ఒలింపియాడ్ 2024 లో మహిళల మరియు పురుషుల విభాగంలో స్వర్ణాలు నెగ్గిన జట్టు ఏది.?
జ : ఇండియా
4) గోండు లిపి సృష్టించిన ఆదిలాబాద్ వాసి మృతి చెందారు. అతని పేరు ఏమిటి.?
జ : కోట్నాక్ జంగ్
5) దులీఫ్ ట్రోఫీ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్ – ఏ
6) దులీఫ్ ట్రోఫీ 2024 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు.?
జ : అన్షుల్ కాంబోజ్
7) సింగపూర్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ 2024 విజేత ఎవరు.?
జ : లాండో నోరిస్
8) శ్రీలంక నూతన ప్రధానిగా ఎంపికైన మహిళ ఎవరు. ?
జ : హరిణీ అమరసూర్య
9) చైనా వేదికగా జరిగిన హాంగ్జో ఓపెన్‌లో అన్‌సీడెడ్ గా బరిలోకి దిగి డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్న ఆటగాళ్లు ఎవరు.?
జ : భారత ఆటగాళ్లు జీవన్, విజయ్..
10) చైనా వేదికగా జరిగిన చెంగ్డూలో ఓపెన్ లో రన్నరప్‌గా నిలచిన భారత ఆటగాళ్లు ఎవరు.?
జ : యూకీ బాంబ్రీ జోడి
11) ఈసారి మహిళల టీ20 వరల్డ్ కప్‌కు పూర్తి గా ఏ అంపైర్ లతోనే నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) నిర్ణయం తీసుకుంది.?
జ : మహిళ అంపైర్లు
12) లేవర్ కప్ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : టీమ్ యూరప్