CURRENT AFFAIRS IN TELUGU 24th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 24th MARCH 2023

1) 800 ప్రొఫెషనల్ గోల్స్ చేసిన పుట్‌బాల్ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : లియోనల్ మెస్సి (రోనాల్డో 830)

2) ఫుట్ బాల్ కెరీర్ లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు (197)ఆడిన క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోనాల్డో

3) అంతర్జాతీయ చెస్ సమైఖ్య నిర్వహిస్తున్న 2022 – 2023 మహిళల గ్రాండ్ ఫ్రీ సిరీస్ ఏ దేశంలో జరగనుంది.?
జ : భారత్

4) ఆసియా హాకీ సమాఖ్య 2022 సంవత్సరానికి గాను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: గా ఏ మహిళ క్రీడాకారిణికి ఎంపిక చేసింది.?
జ : సలీమా టేటే

5) ఇటీవల సముద్ర గర్భంలో అణ్వాయుధ డ్రోన్ ను పరీక్షించిన దేశం ఏది.?
జ : ఉత్తర కొరియా

6) రెడీమేడ్ మిల్లెట్ డ్రింకును తయారుచేసిన తెలంగాణకు చెందిన స్టార్ట్అప్ సంస్థ ఏది.?
జ : మిల్లెట్ బౌల్

7) మైనారిటీల 4% రిజర్వేషన్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది?
జ : కర్ణాటక

8) ఏ ఐఫోన్ల తయారీ కంపెనీ భారత్ లో తన ప్లాంటును నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.?
జ : పెగాట్రాన్

9) దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలంటూ ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.?
జ : ఆంధ్రప్రదేశ్

10) వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.?
జ : ఆంధ్రప్రదేశ్

11) కేంద్రం ఏ రాష్ట్రాలలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్

12) ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 25

13) ‘వన్ వరల్డ్ టీబీ సదస్సు’ ఏ నగరంలో నిర్వహించారు.?
జ : వారణాసి

14) బ్రిటన్ రాజు చార్లెస్ – 3 మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మ్యూజియం ఏది.?
జ : గ్రెవిన్ వ్యాక్స్ మ్యూజియం

15) క్షయ వ్యాధి నిర్మూలనకు గాను విశేష కృషి చేసినందుకు తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణలోని ఏ జిల్లాలకు పథకాలు లభించాయి.?
జ : నిజామాబాద్ (స్వర్ణం), హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెం (సిల్వర్), ఖమ్మం (కాంస్యం)

16) ఒక కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఎవరి లోక్ సభ సభ్యత్వం రద్దు అయ్యింది.?
జ : రాహుల్ గాంధీ

17) విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఏర్పాటు చేసిన నూతన ఎన్జీవో సంస్థ పేరు ఏమిటి.?
జ : SEVVA

18) భోపాల్ లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో రెండు విభాగాలలో కాంస్య పథకాల సాధించిన భారత షూటర్ ఎవరు.?
జ : రుద్రాంక్స్ పాటిల్

19) మహిళల ప్రీమియర్ లీగ్ – 2023 లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ ఎవరు.?
జ : ఇస్సీ వాంగ్

20) మహిళల ప్రీమియర్ లీగ్ – 2023 లో ఫైనల్స్ కు చేరిన జట్లు ఏవి.?
జ : ఢిల్లీ & ముంబై

21) భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : ఎరిక్ గార్సెట్టి

22)ముడి జనపనార కనీస మద్దతు ధరను కేంద్రం ఎంతకు పెంచింది.?
జ : 5,050/-

23) వంట గ్యాస్ సిలిండర్ లపై 200/- రాయితీ ఇస్తున్న ఏ పథకాన్ని మరో ఏడాది పాటు కేంద్రం పొడిగించింది.?
జ : ఉజ్వల