BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 23rd OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 23rd OCTOBER 2024
1) తాజాగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ యువకుడు ఎవరు .?
జ : జీ సంపత్ కుమార్
2) అంతర్జాతీయ టీట్వంటీ లలో రెండో వేగవంతమైన సెంచరీ 33 బంతుల్లో ఎవరు కొట్టారు.?
జ : సికందర్ రాజా (జింబాబ్వే)
3) పుప్పొడి స్వరూపంలోని సంక్లిష్టమైన అందాన్ని వస్త్ర రూపకల్పనలో పొందుపరిచి ‘పరాగమంజరి’ అనే నూతన వస్త్ర కళారూపానికి ఎవరు అంకురార్పణ చేశారు.?
జ : ఓయూ బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లం విజయభాస్కర్‌రెడ్డి, విద్యార్థిని శివాని
4) అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు స్కోరు 344/4 సాదించిన జట్టు ఏది.?
జ : జింబాబ్వే (గాంబీయా తో)
5) లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన (103 బంతుల్లోనే ) ద్విశతకాన్ని నమోదు చేసిన క్రికెటర్ ఎవరు.?
జ : న్యూజిలాండ్ క్రికెటర్ చాడ్ బోవ్స్
6) IMF అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.00%
7) IMF అంచనాల ప్రకారం 2025 – 26 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.50%
8) అర్చరీ వరల్డ్ కప్ 2024 లో సిల్వర్ మెడల్ సాధించిన భారత క్రీడకారిణి ఎవరు.?
జ : దీపికా కుమారి
9) బ్రిక్స్ సమావేశాలు 2024 లో ఏ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.?
జ : మల్టీ డెవలప్మెంట్ బ్యాంకు (MDB)
10) తాజాగా ఏ దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా రహిత దేశంగా ప్రకటించింది.?
జ : ఈజిప్టు
11) G7 రక్షణ శాఖ మంత్రుల మొట్టమొదటి సమావేశం తాజాగా ఎక్కడ నిర్వహించారు.?
జ : నేపుల్స్ (ఇటలీ)
12) ఐసీసీ హల్ ఆఫ్ ఫేమ్ లో తాజాగా ఎవరికి చోటు దక్కింది.?
జ : నీతూ డేవిడ్, అలస్టర్ కుక్, ఏబీ డివిలియర్స్
13) హ్యుమనిటేరయన్ అవార్డు 2024 ను ఎవరికి అందజేశారు.?
జ : మోహన్ జీ
14) భారత మహిళల పుట్ బాల్ క్రీడలో మొట్టమొదటి సారిగా 50 గోల్స్ సాదించిన క్రీడాకారిణి ఎవరు.?
జ : బాలాదేవి