BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 22nd SEPTEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 22nd SEPTEMBER 2024
1) సింగపూర్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ 2024విజేతగా ఎవరు నిలిచారు. ?
జ : లాండో నోరిస్
2) గోండు లిపి ఆవిష్కర్త మరణించారు.?
జ : కోట్నాక్ జంగు (ఆదిలాబాద్)
3) ఒకే వేదికపై (చెపాక్) టెస్టుల్లో సెంచరీ మరియు 5 వికెట్లు తీసీన ఒకే ఒక క్రికెటర్ ఎవరు.?
జ : రవిచంద్రన్ అశ్విన్
4) అంతర్జాతీయ టెస్టులలో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఎవరు షేన్ వార్న్ రికార్డు సమం చేశారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్ (37 సార్లు) & మురళీధరన్ (67 సార్లు)
5) అమెరికా లోని ఏ నగరాలలో భారత నూతన కాన్సులేట్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.?
జ : బోస్టన్ & లాస్ ఎంజెల్స్
6) కేంద్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7 శాతం కేసులు ఎన్ని రాష్ర్టాలలోనే చోటుచేసుకున్నాయి.?
జ : 13
7) కేంద్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన దౌర్జన్య కేసులలో మొదటి మూడు రాష్ట్రాలు ఏవి.?
జ : యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్
8) బంగ్లాదేశ్ తాజాగా ఏ చేపల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. ?
జ : పద్మా పులస చేపలు
9) శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.?
జ : మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (56)
10) భూమి వైపుగా దూసుకొస్తున్న ఘ ఆస్టరాయిడ్ దిశ మారితే విధ్వంసం తప్పదంటూ శాస్త్రవేత్తల చెబుతున్నారు.?
జ : అపోఫిస్
11)ప్రతిష్టాత్మక బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ లో పురుషుల, మహిళల విభాగాల్లోనూ స్వర్ణాలు గెలుచుకున్న దేశం ఏది ?
జ : భారత్
12) దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2024 ని ఏ జట్టు గెలుచుకుంది.?
జ : మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’
13) పోలిష్ ఇంటర్నేషనల్ 2024’ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : అన్మోల్ ఖర్బ్
14) ఏ రికార్డు తో గిన్నిస్ బుక్‌లోకి మెగాస్టార్ చిరంజీవి చోటు సంపాదించుకున్నారు.?
జ : 156 సినిమాలు.. 537 పాటలు.. 24వేల స్టెప్పులతో రికార్డు.