Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 22nd OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 22nd OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 22nd OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 22nd OCTOBER 2024

1) 2023-24 సంవత్సరంలో ధాన్యం ఉత్పత్తిలో ఏ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్ గా నిలిచింది.?
జ : తెలంగాణ (వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి 168 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి)

2) 16వ బ్రిక్స్ స‌మావేశాలు ఎక్కడ జరగనున్నాయి.?
జ : ర‌ష్యాలోని క‌జ‌న్ సిటీలో

3) తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు ఏమిటి.?
జ : దానా తుఫాన్‌

4) పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భూమికి రక్షణ కల్పించేందుకు ఏ డస్ట్‌ను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదన చేశారు.?
జ : డైమండ్‌ డస్ట్‌

5) అధిక బ‌రువు, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కారణంగా ముంబై రంజీ జ‌ట్టు నుంచి ఎవరిని తాజాగా తొలగించారు.?
జ : పృథ్వీ షా

6) అవినీతి కేసులో దోషిగా తేలిన పెరూ ఏ మాజీ అధ్యక్షుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.?
జ : అలెజాండ్రో టోలేడో

7) కామన్వెల్త్ క్రీడలు 2026 నుండి ఎన్ని క్రీడలను తొలగించారు.?
జ : 9

8) కామన్వెల్త్ క్రీడలు 2026 నుండి తొలగించిన క్రీడలు ఏవి.?
జ : హకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్

9) తెలంగాణ రాష్ట్ర గ్రామాలలో జనాభా ఎంతగా ఉన్నట్లు తాజాగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా గణాంకాలు తెలుపుతున్నాయి.?
జ : 2.02 కోట్లు (57.72%)

10) తెలంగాణ పట్టణాలలో జనాభా ఎంతగా ఉన్నట్లు తాజాగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా గణాంకాలు తెలుపుతున్నాయి.?
జ : 1.48 కోట్లు (42.28%)

11) డిసెంబర్ నాటికి ఏ ఆధునాతన స్టెల్త్ యుద్ధ నౌక భారత్ అమ్ములపొదిలో చేరనుంది.?
జ : స్టెల్త్ ప్రిగెట్ యుద్ధ నౌక

12) ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ప్రబోవో సుబయాంటో

13) WTA టెన్నిస్ తాజా ర్యాకింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన మహిళ క్రీడాకారిణి ఎవరు.?
జ : అరియానా సబలెంక

14) ఇంగ్లండ్ లో రతన్ టాటా స్మారకార్థం ఏ కళాశాల తో కలిసి “రతన్ టాటా బిల్డింగ్” ను టాటా గ్రూప్ చేపట్టనుంది.?
జ : సోమర్‌విలే కాలేజ్

15) వాల్ట్ డిస్నీ నూతన చైర్మన్ గా ఎవరు భాధ్యతలు చేపట్టనున్నారు.?
జ : జేమ్స్ గోర్మన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు