CURRENT AFFAIRS IN TELUGU 22nd MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 22nd MARCH 2023

1) “ఐక్యరాజ్యసమితి వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్టు -2023” ప్రకారం ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు శుద్ధమైన తాగునీరు అందడం లేదు.?
జ : 26% మందికి

2) హురూన్ సంపన్నుల జాబితా – 2023 ప్రకారం భారత్లో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు.?
జ : ముఖేష్ అంబానీ

3) భారత్ లో జరుగుతున్న ISSF ఫిస్టల్/రైఫిల్ వరల్డ్ కప్ లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణ పథకం ఎవరు గెలుచుకున్నారు.?
జ : సరభ్ జ్యోత్ సింగ్

4) కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ కు 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల బడ్జెట్ ను లోక్ సభ ఆమోదించింది.?
జ : 1.18 లక్షల కోట్లు

5) నాసా ఇటీవల ఏ గ్రహం మీద అగ్నిపర్వతాలను గుర్తించింది.?
జ : శుక్రుడు (వీనస్)

6) ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : న్యూ ఢిల్లీ

7) ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) 2030 వరకు భూగ్రహం యొక్క ఉష్ణోగ్రతలను ఎంత డిగ్రీల సెల్సియస్ కు మాత్రమే పెరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.?
జ : 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్

8) నిపుణుల అధ్యయనం ప్రకారం కోవిడ్ వైరస్ ఏ జంతువుల నుండి వ్యాపించినట్లు పేర్కొన్నారు.?
జ : చైనా లోని వుహన్ మార్కెట్ లో రకూన్ డాగ్స్ నుంచి

9) ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2023 పురుషుల మరియు మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు.?
జ : లీ షీ ఫెంగ్ (చైనా) & అన్ సే యంగ్ (దక్షిణ కొరియా)

10) బంగ్లాదేశ్ చైనా సహకారంతో ఇటీవల ప్రారంభించిన జలాంతర్గామి బేస్ పేరు ఏమిటి.?
జ : BNS షేక్ హసీనా

11) నాలుగోవ ఏషియన్ ఖో – ఖో ఛాంపియన్షిప్ 2023 క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి.?
జ : అస్సాం

12) జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏ కంపెనీ పెట్టనుంది. ఈ కంపెనీ 250 కోట్లతో శ్రీనగర్ లోని సెంపోరా ప్రాంతంలో అతిపెద్ద షాపింగ్ మాల్ ను నిర్మించనుంది.?
జ : Emaar Group (దుబాయ్)