CURRENT AFFAIRS IN TELUGU 22nd FEBRUARY 2023
1) కుల వివక్షను నిషేధిస్తూ అమెరికాలోని ఏ నగరం నిర్ణయం తీసుకుంది.?
జ : సియాటెల్
2) భారత ఔషధ నియంత్రణ మండలి (డి సి జి డైరెక్టర్ జనరల్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రాజీవ్ సింగ్ రఘువంశీ
3) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు భారతదేశంలోకి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశం ఏది.?
జ : సింగపూర్
4) అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వృద్ధిలో భారత వాటా ఎంత .?
జ : 15%
5) అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నివేదిక ప్రకారం 2022 – 23 మరియు 2023 – 24 లలో భారత వృద్ధి శాతాలను ఎంతగా అంచనా వేసింది.?
జ : 2022 – 23 : 6.9%
2023 – 24 : 6.1^
6) ప్రో ఆన్లైన్ చెస్ లీగ్ లో ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఆటగాడు కార్ల్‌సన్ ను ఓడించిన భారతీయ ఆటగాడు ఎవరు.?
జ : విదిత్ గుజరాతీ
7) ప్రపంచ షూటింగ్ ఛాంపియన్స్ షిప్ 2023 లో వ్యక్తిగత 50 మీటర్ల రైఫిల్ విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత షూటర్ ఎవరు.?
జ : ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్
8) ఒకేసారి 16 అణ్వాయుధాలను ప్రయోగించగల ఖండాతర క్షిపణి సర్మత్ (సాటన్ – 2) ఏ దేశానికి చెందింది.?
జ : రష్యా
9) 22వ లా కమిషన్ గడువును ఎప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.?
జ : ఆగస్టు – 2024
10) 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరు.?
జ : జస్టీస్ రుతిరాజ్ అవస్తి (రిటైర్డ్)
11) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన భారతీయ సంతతి వ్యాపారవేత్త ఎవరు.?
జ : వివేక్ రామస్వామి
12) హైదరాబాదులోని ఏ సంస్థను గ్లోబల్ మిల్లెట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.?
జ : IIMR ( భారత చిరుధాన్యాల పరిశోదన సంస్థ)
13) 2022 – 23 సంవత్సరంలో తెలంగాణలో యాసంగి పంట సాగు విస్తీర్ణం ఎంత.?
జ : 68.53 లక్షల ఎకరాలు
14) 2022 – 23 సంవత్సరం లో తెలంగాణలో యాసంగి పంట సాగులో వరి సాగు విస్తీర్ణం ఎంత.?
జ : 53.08 లక్షల ఎకరాలు
15) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : షెల్లీ ఒబెరాయ్
16) CBRE దక్షిణాసియాలో చేసిన సర్వే ప్రకారం ఎంత శాతం మంది భారతీయులు విదేశాల్లో స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు..?
జ : 17%
17) కేంద్ర ప్రభుత్వం ఒకటవ తరగతి అడ్మిషన్ కు కనీస వయసుగా ఎంత వయసును నిర్ణయించింది.?
జ : ఆరు సంవత్సరాలు
Comments are closed.