CURRENT AFFAIRS IN TELUGU 21st JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 21st JANUARY 2023

1) ఏ రాష్ట్రంలో అతిపెద్ద రెడ్ రిబ్బన్ మానవహారాన్ని ఎయిడ్స్ మీద అవగాహన కోసం నిర్వహించారు.?
జ : ఒడిశా

2) 8వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : మనిత్ (భోపాల్)

3) ఆర్థిక సంక్షోభం తర్వాత శ్రీలంకకు రుణ సహాయాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఏది.?
జ : ఇండియా

4) మాల్దీవులలోని ఏ విమానాశ్రయ అభివృద్ధికి భారత సహకారం అందించనుంది.?
జ : హనీమాదూ..

5) ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిన భూమిని పోలిన ఉపగ్రహానాకి ఏమి పేరు పెట్టారు.?
జ : LHS – 475B

6) ఫెడరల్ బ్యాంక్ సాహిత్య అవార్డు 2022 ఎవరికి ఎంపికయ్యారు.?
జ : కే. వేణు

7) ఇటీవల ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ లలో ప్రపంచవ్యాప్తంగా భారత స్టాక్ మార్కెట్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ: ఐదవ స్థానం

8) న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ని గెలుచుకోవడంతో భారత్ లో టీమిండియా వరుసగా ఎన్ని సిరీస్ విజయాలను నమోదు చేసుకుంది.?
జ : 7 వన్డే సిరీస్‌లు

9) వరంగల్, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పండించే ఏ రకం మిర్చిని జియోగ్రాఫికల్ ఇండెక్స్ గుర్తింపు కోసం పంపడం జరిగింది.?
జ : చపాట రకం మిర్చి

10) హైదరాబాద్ నిజాం వారసుడిగా ఎవరిని ప్రకటించారు.?
జ : మీర్ మహ్మద్ అజ్మత్ ఆలీఖాన్ అజ్మత్ జా

11) మహిళా ఉద్యోగులకు సంవత్సరం పాటు మాతృత్వ సెలవులను ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రం ఏది.?
జ : సిక్కిం

12) TSNPDCL కు ఎన్ని స్కోచ్ అవార్డులు 2022 దక్కాయి.?
జ : 2

13) ఆస్కార్ 2022 ఉత్తమ నటుడు జాబితాలో టాప్ టెన్ లో భారత్ నుండి ఉన్న నటుడు ఎవరు.?.
జ : ఎన్టీఆర్ (RRR)

14) ముస్లింల ఏ ఆచారాలు రాజ్యాంగబద్ధమో కాదో తేల్చడానికి పైన ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసునాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.?
జ : బహు భార్యత్వం, నిఖా హలాల

15) WTT దోహా కంటెండర్ టోర్నమెంట్ టేబుల్ టెన్నిస్ లో రెండు కాంస్య పథకాలు సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : మనికా బత్రా

16) వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022 ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.?
జ : 21 వేల కోట్లు

17) ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు .?
జ: చాగంటి కోటేశ్వరరావు